అమెరికా స్ప్రింటర్ క్రిస్టియన్ కోల్‌మన్ 100మీ పరుగుపందెంలో బంగారు పతకాన్ని సాదించాడు.ఖతార్ వేదికగా జరుగుతున్న ఈ ఛాంపియన్‌షిప్‌లో ఉసేన్ బోల్ట్ తలపిస్తూ 100మీ పరుగుని కోల్‌మన్ కేవలం 9.76సెకన్లలోనే పూర్తిచేశాడు.9.89సెకన్లతో అమెరికాకి చెందిన గాట్లిన్ రెండో స్థానంలో, 9.9సెకన్లతో కెనడా కి చెందిన ఆండ్రిడిగ్రాస్ మూడోస్థానంలో నిలిచారు.ఇలా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఈ అమెరికా స్ప్రింటర్ స్వర్ణం గెలుచుకున్నాడు.
బోల్ట్ లేకుండా ఈ టోర్నీలో ఈ 23 ఏళ్ల అమెరికా స్ప్రింటర్ అత్యుత్తమ టైమింగ్‌తో తిరుగులేదని విజయం పొందాడు.