మెగాస్టార్ చిరంజీవి తన అభిమానుల కోసం ఓ కొత్త పథకాన్ని తీసుకువచ్చాడు. ఎన్‌టీఆర్, నాగేశ్వర్ రావు తరువాత టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన మెగాస్టార్ లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే అభిమానుల చేత ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు చేయించుకుంటూ వస్తున్నమెగాస్టార్ తన స్థానాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తున్నాడు. అయితే మెగా అభిమానుల సపోర్ట్ రాజకీయాలలో పెద్దగా కలిసిరాకపోయినా సినిమా జీవితంలో మాత్రం ఇప్పటికి చెక్కు చెదరలేదనే చెప్పాలి.
అయితే తనకు అండగా నిలిచిన అభిమానుల కోసం చిరంజీవి ఒక పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు సమాచారం. మెగా అభిమానులందరికి ఇన్సూరెన్స్ చేయించాలని చిరంజీవి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కార్యక్రమాల పనిలో మెగా స్టార్ ఉన్నట్లు టాక్. ప్రమాదవశాత్తు మెగా అభిమానులలో ఎవరైనా చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకునేలా ఈ భీమా ఉంటుందని అంటున్నారు. అయితే మెగా అభిమానులు అందరిని ఈ పథకంలోకి తేవాలని అనుకునున్నారట. అయితే తనకు అండగా ఉన్న అభిమానుల కోసం మెగస్టార్ చిరంజీవి తల పెట్టిన ఈ కార్యక్రమం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాఫిక్‌గా మారింది.
