తన తల్లికి పుట్టకపోయినా తప్పిపోయిన తన సవతి అక్క ఆచూకి కోసం ఓ తమ్ముడు పడిన ఆరాటం, ఆవేదన తొమ్మిదేళ్ళకి ఫలించింది. కానీ ఆచూకీ లభించింది తన అక్కది కాదు అక్క శవానిది. తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకొని ఆచూకీ లేకుండా పోయిన అక్క కోసం నిరంతరం వెతుకులాడుతూ యువకుడు పడిన తపన అంతా ఇంతా కాదు కానీ చివరికి కట్టుకున్నోడే కాలయముడయ్యడాని తెలిసి కూలబడ్డాడు. తన అక్కకి జరిగిన అన్యాయానికి అతనికి శిక్ష పడాలని పోలీసుల దగ్గరకి వెళ్లి కంప్లైంట్ ఇచ్చి అతన్ని అరెస్ట్ చేయించాడు.
అందుతున్న సమాచారం ప్రకారం గ్రామానికి చెందిన ఒక యువకుడికి ఊహ తెలిసేప్పటికే తనని తల్లిలా చూసుకునే అక్క వదిలి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్లిందో తెలీదు, ఇప్పుడేక్కకడుందో తెలీదు దీంతో మూడేళ్ళ క్రితం తన అక్క కోసం మొదలుపెట్టిన వెదుకులాట ఆమె అవశేషాలని చూపెట్టింది. వివరాల్లోకి వెళితే వెళ్తే నార్కెట్ పల్లి మండలం మాండ్రా గ్రామానికి చెందిన లింగమ్మ అలియాస్ ప్రియాంక , మర్రిగూడెం మండలం వెంకేపల్లి గ్రామానికి చెందిన మోర.హనుమంతు ప్రేమించుకొని బయటికి వెళ్లి 2004 లో వివాహం చేసుకున్నారు.
హనుమంతు హైదరాబాద్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వీరికి 2005 లో బాబు, 2006 లో పాప జన్మించింది. అయితే భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించిన హనుమంతు ఆమెను అతి దారుణంగా హత్య చేసి బావిలో పడవేసి, ఆమెకు పుట్టిన సంతానంలో బాబును కొండ మల్లేపల్లి తెలిసినవారికి, పాపను హైద్రాబాద్ లో విక్రయించి ఇప్పుడు మరో వివాహం చేసుకుని కాపురం చేస్తున్నాడు.
మూడు సంవత్సరాలపాటు అక్కని వెతుకున్న యువకుడు తన అక్కను ప్రేమించింది హైదరాబాదులో డ్రైవర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అని తెలుసుకుని తన అక్కను ప్రేమ వివాహం చేసుకున్న అతని అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు కానీ అక్కడ అటువంటి వారు ఎవరూ లేరు, దీంతో అతని కోసం వెతుకులాట ప్రారంభించి ఫేస్ బుక్ ద్వారా అతన్ని గుర్తించి వారి ఊరికి వెళ్లి జరిగిన విషయం అంతా గ్రహించి మొదట ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించాడు వారి సూచనమేరకు మర్రిగూడ పోలీసులు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.