యాంకర్ తేజశ్విని ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. కృష్ణా జిల్లా ఈడుపుగల్లు ఎంబీఎంఆర్ కాలనీలో నివసిస్తున్న మట్టపల్లి తేజస్విని శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తొలుత ఘటనాస్థలంలో సూసైడ్ నోటు లభించినా, రెండు రోజుల తర్వాత తేజస్విని ఆత్మహత్యకు పాల్పడిన ప్రదేశంలో సూసైడ్ నోట్ దొరికిందంటూ కేసును సెక్షన్ 498, 306కు మార్చడం అనుమానాలకు తావిస్తోంది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లి ఎం.వెంకటరమణమ్మ, భర్త పవన్‌కుమార్‌లు తీసుకెళ్లేందుకు ఇష్టపడలేదు. దీంతో విజయవాడలోనే అంత్యక్రియలు నిర్వహించారు. యాంకర్ తేజశ్విని మృతదేహం వద్ద సూసైట్ నోటు లభించిందని “పవన్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నమ్మి వచ్చినందుకు నన్ను వేధించాడు. ఇబ్బందులు పెడుతున్నాడు. నాకన్నా స్నేహితులులే అతనికి ఎక్కువయ్యారు. నన్న పట్టించుకోవడం లేదు. మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నా” అంటూ సూసైడ్ నోట్ లో తేజశ్విని పేర్కొందని తెలుస్తోంది.