Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొన్ని నెలల క్రితం తెలుగు సినిమా పరిశ్రమను డ్రగ్స్ ఇష్యూ ఏ స్థాయిలో ఉడికించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో పలువురు స్టార్స్‌కు డ్రగ్స్ కేసులో పోలీసులు నోటీసులు జారీ చేయడం, ఒకరి తర్వాత మరొకరు అంటూ కొన్ని రోజుల పాటు డ్రగ్స్ తీసుకున్నట్లుగా అనుమానాలున్న వారిని, డ్రగ్స్ ముఠాతో సంబంధం ఉన్న వారిని పోలీసులు విచారించిన విషయం తెల్సిందే. ఎట్టకేలకు డ్రగ్స్ కేసు ఒక కొలిక్కి వచ్చింది. విచారణ తర్వాత మళ్లీ మీడియాలో డ్రగ్స్ కేసు గురించి వార్తలు రాకపోవడంతో పోలీసులు కేసును లైట్ తీసుకున్నట్లుగా ఉన్నారని, ప్రభుత్వం సినిమా పరిశ్రమ పెద్దల విజ్ఞప్తి మేరకు కేసును నీరు గార్చేందుకు ప్రయత్నాలు చేసిందని అన్నారు. కాని ప్రభుత్వం ఈ కేసులో ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని తేలిపోయింది.
విచారణ సందర్బంగా శాంపిల్స్ ఇచ్చిన సెలబ్రెటీల్లో కొందరు డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలింది. వారు డ్రగ్స్ తీసుకుని మానేసి ఉంటారని, ఇంకొందరు కంటిన్యూ చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్థారణ అయిన వారి పేర్లను ప్రకటించేందుకు పోలీసు శాఖ ఆసక్తి చూపడం లేదు.
ఇక డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలిన సెలబ్రెటీలకు రహస్యంగా కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు, ఇకపై తీసుకోకుండా ఒప్పందం చేయించుకోవడం మరియు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వైధ్యం అందించడం చేయనున్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి నీరు గారిపోయింది అనుకున్న డ్రగ్స్ కేసులో మళ్లీ కదలిక రావడం అందరిలో కాస్త ఆందోళనను కలిగిస్తుంది.