ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద మిస్టరీగా మిగిలిపోయిన రెండు కేసులు కూడా ఒకే ఏడాది కావడం గమనార్హం.అవే గత ఏడాది ప్రతిపక్ష నేత మరియు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్ పై జరిగిన హత్యా యత్నం కోడి కత్తి దాడి.అలాగే అదే జగన్ కు చిన్నాన్న అయినటువంటి వై ఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య.మొదటిది ఎలా ఎటు పోయిందో ఎవరికీ అర్ధం కాలేదు కానీ ఇప్పుడు వై ఎస్ వివేకా కు సంబంధించిన కేసు విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు సరికొత్త ట్విస్టులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
అలాగే ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుందని ఏపీ రాజకీయ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లోని సిబిఐ కు అప్పగించాలని కోరుతుండగా ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లోనూ సిబిఐకు ఇవ్వొద్దంటూ ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ హై కోర్ట్ ను కోరినట్టు తెలిపిన వార్త షాకింగ్ ట్విస్టును ఇచ్చింది.ఇప్పటికే ఈ కేసు విచారణను చేపట్టిన సిట్ నివేదిక పూర్తి చేయనుంది అని అలాంటప్పుడు ఈ తరుణంలో మళ్ళీ సిబిఐ కు ఎందుకు ఇవ్వాలని ప్రభుత్వ అడ్వొకేట్ సరికొత్త వాదనను తీసుకొచ్చారు.ఇలా ఎప్పటికప్పుడు ఈ కేసులో సరికొత్త ట్విస్టులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.మరి ఈ కేసు ఎప్పుడు తేలుతుందో చూడాలి.