పవర్ కంపెనీలు పెట్టి కోట్లల్లో పెట్టుబడులంటూ కొల్లగొట్టి బోర్డు తిప్పేసిన బడా బాబుల బ్రహ్మాండం బద్దలైంది. మన్నం వెంకట రమణారావు పుట్టా కిశోర్ అనే ఈ ఇద్దరు కేటుగాళ్లు కలిసి 2010 సెప్టంబర్ 3 వతేదీన పార్క్సన్ థర్మల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కార్పోరేట్ కంపెనీని స్థాపించారు. ఆ సమయంలో ఈ కంపెనీలో పలువురు వ్యక్తులు షేర్ల రూపంలో పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడులు పెట్టించుకున్న తర్వాత ఆ కంపెనీ యాజమాన్యం కొంతకాలానికి బోర్డ్ తిప్పేసింది. దీంతో ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టి మోసపోయిన శ్రీకాత్ రెడ్డి, రామచంద్రారెడ్డి అనే వ్యక్తులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఇంటర్ పోల్ అధికారులు వారిద్దరికీ లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు.
అయితే వీరిలో ఒకరిని గత సంవత్సరం పోలీసులు అరెస్ట్ చేయగా మరొకరు తప్పించుకొని తిరుగుతున్నారు. ఈ మేరకు సీపీ అంజనీ కుమార్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించిన కొంత సమాచారాన్ని మీడియాకు వెల్లడించారు. పార్క్సన్ థర్మల్ పవర్ కంపెనీ యజమానుల్లో ఒకరు ఇప్పటికే అరెస్ట్ కాగా ఆ తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు. అంతే కాకుండా అన్ని పోర్ట్ లలో ఏ క్షణాన్నైనా దొరికితే అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఇంటర్ పోల్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా అతను ఆ వ్యక్తి ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోందని సీపీ వెల్లడించారు.