Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాలీవుడ్ నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన పహ్లాజ్ నిహ్లానీకి కేంద్రం షాకిచ్చింది. ఆరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ ఉందన్న కారణంతో పహ్లాజ్ ను సెన్సార్ బోర్డు ఛైర్మన్ గా నియమించిన కేంద్రం.. వరుస వివాదాలతో తల పట్టుకుంది. స్టార్ల సినిమాలకూ సర్టిఫికెట్ డిలే చేయడంతో.. ఆ సినిమాలు ఆడకుండా పోయిన రోజులున్నాయి. అందుకే బాలీవుడ్ కూడా అప్పట్లో దుమ్మెత్తిపోసింది.
అయితే ఇప్పుడు నిహ్లానీ ప్లేస్ లో వచ్చిన ప్రసూన్ జోషీ కూడా అదే బాటలో పయనిస్తున్నారట. ఈయన కాషాయవాదే. అందుకే నిహ్లానీ కంటే ఎక్కువ కట్లు చెబుతున్నారట. దీంతో బాలీవుడ్ కూడా పాత మొగుడే నయమని మథనపడుతోందట. అటు నిహ్లానీ కూడా ఇదే టైమని కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వ తీరు కారణంగానే తాను కొన్ని పనులు చేయాల్సి వచ్చిందని బాంబు పేల్చారు.
కొన్ని సినిమాలకు ఆలస్యంగా సెన్సార్ చేయాలని కేంద్రమే చెప్పిందని, అలాగే మరికొన్ని సినిమాలు నిజంగానే అభ్యంతరకరంగా ఉన్నాయని నిహ్లానీ చెప్పుకొచ్చారు. ఇందూ సర్కార్ మూవీ వివాదం వల్లే తనను పదవి నుంచి తొలగించారని నిహ్లానీ చెప్పుకొచ్చారు. పహ్లాజ్ తీరు చూస్తుంటే త్వరలోనే మోడీపై మరిన్ని బాంబులు వేసే ఛాన్స్ కనిపిస్తోంది.