Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మూడు నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించే చిత్రం రాలేదు. ఎట్టకేలకు ‘రంగస్థలం’ చిత్రం విడుదలై ఆ లోటును తీర్చేస్తుంది. మూడు రోజుల్లోనే ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను వసూళ్లు చేసి సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు మరియు ఓవర్సీస్లో దుమ్ము దుమ్ముగా కలెక్షన్స్‌ను రాబడుతుంది. లాంగ్ రన్లో ఈ చిత్రం 300 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబడుతుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలవులు కారణంగా సినిమాకు భారీ ఆక్కుపెన్సీ వస్తుంది. ఈ జోరు కనీసం రెండు వారాలు కొనసాగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నితిన్ చిత్రం రాబోతుంది.
నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. పవన్ కళ్యాణ్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అయితే ‘రంగస్థలం’ జోరు కొనసాగుతున్న సమయంలో ఈ చిత్రంను విడుదల చేయడం మంచి నిర్ణయం కాదని, ఎట్టి పరిస్థితుల్లో కూడా నితిన్ చిత్రం రంగస్థలం జోరును తగ్గించలేదని విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఇలాంటి సమయంలో సినిమాను విడుదల చేయడం అంటే సేఫ్ కాదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంత పవన్ నిర్మించిన చిత్రం అయినా కూడా రంగస్థలం జోరు ముందు నిల్చోలేక పోవచ్చు అంటున్నారు. అయితే సినిమా విడుదలకు రంగం సిద్దం అయ్యింది. ఛల్ మోహన్ రంగ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ నెల 5న విడుదలకు సిద్దం అవుతుంది. ‘ఛల్ మోహన్ రంగ’కు నెగటివ్ టాక్ వస్తే మినిమం కలెక్షన్స్ కూడా రాకపోవచ్చు అనే టాక్ కూడా వస్తుంది. మరో మూడు రోజుల్లో రాబోతున్న నితిన్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో ప్రభావం చూపుతాడో చూడాలి.