Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు, తమిళంలో ఎన్నో అద్బుత చిత్రాల్లో నటించి మెప్పించిన సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ‘మహానటి’ చిత్రం తెరకెక్కిన విషయం తెల్సిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషించింది. ఒక కీలక పాత్రలో సమంత నటించింది. సావిత్రిగా కీర్తి సురేష్ ఆకట్టుకుందని, అచ్చు సావిత్రిలా ఉందని, కీర్తి సురేష్ కాకుండా మరే హీరోయిన్ చేసినా కూడా ఈ సినిమా ఇంతగా ఆకట్టుకోలేక పోయేది అంటూ సినీ వర్గాల వారు మరియు సినీ విమర్శకులు అంటున్నారు. సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ ప్రాణం పోసింది. కొన్ని సీన్స్‌లో నిజంగా సావిత్రి బతికి వచ్చి ఆ సీన్స్‌ను చేసిందా అన్నట్లుగా అనిపించింది. సావిత్రిగా నటించినందుకు కీర్తి సురేష్‌కు ఎక్కడ లేని పేరు ప్రఖ్యాతు దక్కాయి. అయితే ఆ పాత్రను మొదట నిత్యామీనన్‌తో నాగ్ అశ్విన్ చేయించాలని భావించాడు.
‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రం తర్వాత పూర్తి స్థాయిలో సావిత్రి జీవిత చరిత్ర చిత్రంపై దర్శకుడు నాగ్ అశ్విన్ పడ్డాడు. స్క్రిస్ట్ తయారు చేస్తున్న సమయంలో సావిత్రి పాత్రకు నిత్యామీనన్ అయితే బాగుంటుందని భావించాడు. అనుకున్నదే తడువుగా నిత్యామీనన్‌తో నాగ్ అశ్విన్ మాట్లాడాడు. మొదట సరే మొత్తం స్క్రిప్ట్ రెడీ చేయండి, కథ చెప్పండి చూద్దాం అంటూ సమాధానం ఇచ్చిన నిత్యా మీనన్ ఆ తర్వాత పెద్దగా స్పందించలేదు. పలు సార్లు కథ చెప్పేందుకు ప్రయత్నించినా కూడా ఆమె సున్నితంగా తిరష్కరిస్తూ వచ్చింది. దాంతో ఆమెకు సావిత్రి పాత్రను చేయడం ఇష్టం లేదేమో అని దర్శకుడు మరో హీరోయిన్ కోసం ప్రయత్నించాడు. ఆ సమయంలోనే ఆయనకు కీర్తి సురేష్ తలిగింది. సావిత్రి చిత్రాన్ని వదులుకున్నందుకు నిత్యామీనన్ బాధపడుతుంది. తాజాగా ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంచి పాత్రను చేసే అవకాశం వస్తే వదులుకున్నాను, తెలుగులో అలాంటి పాత్రలు రావడం చాలా అరుదు. ఆ అరుదైన అవకాశంను ఆలోచించకుండా వదిలేసి తప్పు చేశాను అంటూ నిత్యామీనన్ చెప్పుకొచ్చింది. గతంలో కూడా నిత్యామీనన్ రెండు మూడు సినిమాలను వదిలుకుంది. ఆ సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.