నితిన్ బాటలో నడుస్తున్న అభిమానులు

నితిన్ బాటలో నడుస్తున్న అభిమానులు

మన టాలీవుడ్ టైర్ 2 హీరోల్లో టాప్ ప్లేస్ లో ఉండే హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది నితిన్ అనే చెప్పాలి. ఎన్నో ఏళ్ల పాటుగా ప్లాప్స్ చవి చూసినా అలుపు లేని కెరటంలా ఎప్పుడు ఎగసాయి పడుతూనే ఉన్నాడు.దీనికి కారణం ముమ్మాటికి అతని అభిమానులే అని చెప్పాలి. అన్నేళ్లు సరైన హిట్ పడకపోయినా సరే నితిన్ వెన్నంటే ఉండి తమ విధేయతను చాటుకున్నారు.

అయితే నితిన్ ఒక్క హీరోగానే కాకుండా వ్యక్తిగా కూడా ఎంత ఉన్నతమైన వారని మరోసారి నిరూపించుకున్నారు. ఇటీవలే కరోనా కారణంగా సినీ పరిశ్రమలో పని చేసే కార్మికులు పడే ఇక్కట్లను దూరం చెయ్యడని తన వంతు సాయంగా మొత్తం 25 లక్షలు రూపాయలను విరాళంగా ఇచ్చి మన టాలీవుడ్ నుంచి మొదటి అడుగు వేశారు.

ఇప్పుడు నితిన్ బాటలోనే తన అభిమానులు కూడా నడిచి తమ సేవా భావాన్ని చాటుకున్నారు.తాజాగా వారు హైదరాబాద్ లో దాదాపు 300 మందికి పైగా ఆహారాన్ని అందించి తమ అభిమాన హీరో ను మరో మెట్టు ఎక్కించిన వారయ్యారు.