Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డిసెంబర్ తర్వాత ఇప్పటి వరకు ప్రేక్షకుల ముందుకు ఒక్క సూపర్ హిట్ టాక్ దక్కించుకున్న సినిమా రాలేదు. సంక్రాంతికి పెద్ద సినిమాలు రాబోతున్నాయనే ఉద్దేశ్యంతో చిన్న చిత్రాలు అంతకు ముందు వారం కూడా విడుదల కాలేదు. ఇక అజ్ఞాతవాసి కనీసం రెండు వారాల పాటు సందడి చేయడ ఖాయం అని భావించారు. దాంతో సంక్రాంతి తర్వాత వారంలో కూడా పెద్దగా సినిమాలు విడుదల చేయడం లేదు. దాంతో దాదాపు మూడు వారాలుగా బాక్సాపీస్ వద్ద పెద్దగా సందడి లేకుండా పోయింది. సంక్రాంతి మూడు నాలుగు రోజుల పాటు అజ్ఞాతవాసి మరియు జైసింహా చిత్రాలతో కలెక్షన్స్ పర్వాలేదు అనిపించాయి. కాని ఆ తర్వాత నుండి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వెలవెల కనిపిస్తుంది.
ప్రస్తుతం థియేటర్లలో ఉన్న అజ్ఞాతవాసి మరియు జైసింహాలు ప్రేక్షకులకు రుచించడం లేదు. వాటితో పాటు వచ్చిన గ్యాంగ్ మరియు రంగుల రాట్నం చిత్రాలకు పెద్దగా ఆధరణ దక్కలేదు. ప్రస్తుతం నాని ‘ఎంసీఏ’ ఎక్కడైనా ఉంటే ఆ చిత్రాన్ని ప్రేక్షకులు చూడాలని కోరుకుంటున్నారు. అంతే తప్ప మరే ఇతర చిత్రాలను చూడాలని కోరుకోడం లేదు. ఈ వారం రెండు మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కాని ఏ ఒక్కటి కూడా పెద్దగా గుర్తింపు లేకపోవడంతో కలెక్షన్స్ మినిమం కూడా లేవు. ఇక వచ్చే వారంలో మూడు నాలుగు మీడియం చిత్రాలు విడుదల కాబోతున్నాయి. మరి అప్పుడైనా టాలీవుడ్ బాక్సాఫీస్ కలకలలాడుతుందేమో చూడాలి.