రామ్ చరణ్, కైరా అద్వాని జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈ చిత్రంపై సినీ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ ఒక పాట మినహా మొత్తం పూర్తి అయ్యింది. మిగిలి ఉన్న ఆ పాటను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. హీరో, హీరోయిన్ కాంబినేషన్లో చాలా ఘాటుగా, మాస్‌గా ఈ సాంగ్ తెరకెక్కుతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
మాస్ మసాలా పాటలను ట్యూన్ చేయడంలో దేవిశ్రీ ప్రసాద్ సిద్ద హస్తుడు అని చెప్పుకోవాలి. అంతటి దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటను అత్యంత మాస్ బీట్ తో ట్యూన్ చేసినట్లుగా సమాచారం అందుతుంది.మాస్ మసాలా అంటే అంతా కూడా ఐటెం సాంగ్ అనుకుంటారు. కాని ఈ మాస్ సాంగ్‌ను హీరో, హీరోయిన్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం బాలీవుడ్ ఐటెం గర్ల్ అన్నారు. కోలీవుడ్ బామ్మ అన్నారు. వారెవ్వరు లేరు. హీరోయిన్‌తోనే ఆ పాట కూడా పూర్తి చేస్తున్నట్లుగా తాజాగా అనిపిస్తుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ముగించేసి ప్రమోషన్ కార్యక్రమాల్లో పడ్డప్పుడు ఐటెం సాంగ్ ఉందా లేద అనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఐటెం సాంగ్ లేకుండా బోయపాటి మూవీ ఉండదు. కాని ఈ చిత్రంలో ఐటెం సాంగ్‌కు స్కోప్ లేకపోవడం వల్ల తప్పడం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.