రాబోయే రోజుల్లో భవిష్యత్ అంతా AIదేనని, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పారదర్శకత తీసుకొచ్చామన్నారు. స్వర్ణాంధ్ర-2047కు రోడ్ మ్యాప్ సిద్ధం చేశామని చెప్పారు. పహల్గామ్‌లో ఉగ్రదాడి ఘటన దారుణమైందని, భారత్ జోలికి వస్తే మటాష్ అయిపోవాల్సిందేనని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలు సంఘటితంగా ఉండాలని, తీవ్రవాదం సమస్యలు భారత్‌ను ఏం చేయలేవని చంద్రబాబు అన్నారు.



