Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దళితుడికి దళితుడే సరి అని విపక్షాలు ఆలోచించడం బాగానే ఉంది. కానా సొంత సామాజిక వర్గ నేతతో పోటీకి మీరా కుమార్ ఒప్పుకుంటారా..? దళిత సంఘాలు నిలదీస్తే సమాధానం చెప్పుకోగలరా..? మీరు లోక్ సభ స్పీకర్ గా పదవి అనుభవించారు కదా. మళ్లీ ఎందుకు మరొకరి అవకాశం చెడగడుతున్నారని అడిగితే ఆమె క్యాంపైనింగ్ లో సమాధానం చెప్పుకోగలరా అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు.
పైగా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిని చాలా పార్టీలు పాటిస్తున్నాయి. ఆ పాయింట్ లో రామ్ నాథ్ కోవింద్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటికే పలు తటస్థ పార్టీలు ఆయనకు మద్దతిస్తామని ప్రధానికి హామీ ఇచ్చేశాయి. ఓసారి హామీ ఇచ్చాక వెనక్కుపోయే సాహసం అవి చేయకపోవచ్చు. చేస్తే తర్వాత మోడీ చుక్కలు చూపిస్తారని అందరికీ తెలుసు. అందుకే బీజేడీ లాంటి పార్టీ కూడా ఒక్క ఫోన్ కాల్ తో లైన్లోకొచ్చింది.
ఇక ఎటొచ్చీ మమత, లెఫ్ట్, కాంగ్రెస్, ఆప్ గట్టిగా నిలబడతాయని అందరూ భావిస్తున్నారు. కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ ఉండదు. కాబట్టి ఎంపీలు ఆత్మ ప్రబోధానుసారం ఓటేయొచ్చు. వారిని నిర్భంధించే అధికారం ఎవరికీ లేదు. అటు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల పరిస్థితి ఇదే. కాబట్టి క్రాస్ ఓటింగ్ కూడా అధికార పార్టీ అభ్యర్థికే మేలు కలిగిస్తుందనేది నిర్వివాదాంశం. లోక్ సభ స్పీకర్ గా పనిచేసిన అనుభవంతో.. మీరాకుమార్ అసలు బరిలోకి దిగరేమోనన్న సందేహాలు వస్తున్నాయి.