టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సినిమా అంటేనే విపరీతమైన క్రేజ్. ‘బాహుబలి’ చిత్రంతో రాజమౌళి తెలుగు సినీ పరిశ్రమను ఎక్కడికో తీసుకెళ్లాడు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి ఏ సినిమా అయినా కూడా ఆచి తూచి, సక్సెస్ అయ్యే విధంగా చాలా క్రియేటివ్‌గా ఆలోచించి రూపొందిస్తాడు. ఏదైనా ప్రాజెక్ట్ మొదలుపెడితే దాని కోసం సాయశక్తుల పని చేస్తాడు. అయితే ఇంతలా కష్ట పడే జక్కన్న పారితోషిరం ఎంత తీసుకుంటాడు అనే సందేహం వస్తుంది. అయితే ఈయన పారితోషికం కాకుండా లాభాల్లో వాటాను పొందుతాడు. ‘బాహుబలి’ చిత్రానికి కూడా ఇలాగే వాటా తీసుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే ‘బాహుబలి’ ద్వారా రాజమౌళి బాగానే పుచ్చుకున్నాడు అని తెలుస్తోంది.
రాజమౌళి త్వరలో స్టార్ హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్‌లతో ఒక మల్టీస్టారర్‌ను తెరకెక్కించబోతున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అందుకు బడ్జెట్ కూడా బాగానే ప్లాన్ చేశారు. దాంతో ఈ చిత్రంలో నటించే చెర్రీ, తారక్‌లకు పారితోషికం ఇవ్వకుండా జక్కన్న ప్లాన్ చేశాడు. రాజమౌళి సూచన మేరకు చెర్రీ, తారక్‌లు రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటా తీసుకోవడానికి ఓకే చెప్పారట. రాజమౌళి వాటా తీసుకోమని చెప్పడంతో ఈ ఇద్దరు హీరోలు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు అని యూనిట్ వర్గాల నుండి సమాచారం. త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.