నాగ్‌, వర్మల సినిమాలో దానికి నో ఛాన్స్‌…

No Songs and No Romance In Nagarjuna RGV movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తెలుగు కమర్షియల్‌ సినిమా అంటే మూడు ఫైట్లు, ఆరు కామెడీ సీన్స్‌, ఆరు పాటలు, కొన్ని రొమాంటిక్‌ సీన్స్‌ ఉండాలి. ఇందులో ఏది మిస్‌ అయినా కూడా ఫక్త్‌ తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాను నిరాకరిస్తారు. విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాలు కూడా పై అంశాలు లేకుంటే కలెక్షన్స్‌ను రాబట్టలేవు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేకుండా సినిమాలు చేసేందుకు ఎక్కువ మంది హీరోలు ఆసక్తి చూపించరు. కాని నాగార్జున మాత్రం ప్రయోగాత్మక చిత్రాలను చేసేందుకు ఎప్పుడు ముందు ఉంటాడు. కొన్నాళ్ల క్రితం ‘గగనం’ అనే చిత్రంలో నాగార్జున నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో రొమాన్స్‌, కామెడీ, పాటలు వంటివి లేవు. అయినా కూడా ఆ సినిమాకు మంచి పేరు వచ్చింది, కాని కలెక్షన్స్‌ రాలేదు.

తాజాగా నాగార్జున హీరోగా వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా ‘గగనం’ తరహాలో ఉంటుందనే చర్చ జరుగుతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రొమాన్స్‌, కామెడీ, పాటలకు నో ఛాన్స్‌. కేవలం యాక్షన్‌ ప్రధానంగా ఈ చిత్రం ఉంటుందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా అయితే సినిమా ఆడటం కష్టం అంటూ సినీ వర్గాల వారు మరియు మీడియా వారు అప్పుడే విశ్లేషిస్తున్నారు. కాని వర్మపై నమ్మకంతో నాగార్జున ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. కలెక్షన్స్‌ రాకున్నా కూడా పేరు అయినా వస్తుందనే నమ్మకంతో నాగార్జున ఉన్నాడు. ఒక విభిన్న చిత్రం చేశాను అనే పేరు కోసం నాగార్జున ఈ చిత్రాన్ని చేస్తున్నాడు అంటూ కొందరు అంటున్నారు. మొత్తానికి ఈ చిత్రం గురించి అప్పుడే నెగటివ్‌గా ప్రచారం ప్రారంభం అవ్వడం వల్ల సినిమాకు నష్టం జరగవచ్చు. వచ్చే వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.