Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వరుస క్షిపణి ప్రయోగాలతో అమెరికా, జపాన్ తో పాటు ప్రపంచం మొత్తాన్ని బెంబేలెత్తించిన ఉత్తరకొరియా కొన్నాళ్ల నుంచీ మౌనం పాటిస్తోంది. అమెరికాను రెచ్చగొడతూ తరచూ వ్యాఖ్యలు చేసే ఉత్తరకొరియా అధ్యక్షడు కిమ్ జాంగ్ ఉన్ నుంచి ఎలాంటి కవ్వింపు ప్రకటనలూ లేవు. అసలు చానాళ్లుగా కిమ్ అంతర్జాతీయ మీడియాలో కనిపించడమే మానేశారు. ఒకానొక దశలో అమెరికాతో యుద్ధం తప్పదన్న స్థితికి వెళ్లిన ఉత్తరకొరియా ఇలా అప్రకటిత మౌనం పాటించడానికి కారణమేంటనేదానిపై అంతర్జాతీయంగా చర్చ నడుస్తోంది. అమెరికా ఐక్యరాజ్యసమితిలో పావులు కదిపి ఆంక్షలు విధింపచేసినా కూడా వెనక్కి తగ్గకుండా… క్షిపణి ప్రయోగాలు జరిపిన ఉత్తర కొరియా… ఇప్పుడెందుకు ఇలా సైలెంట్ అయిందన్నది ఎవరికీ అర్ధం కాలేదు.
అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో అమెరికా, ఉత్తరకొరియా వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గాయని కొందరు విశ్లేషకులు అంచనావేయగా..మరికొందరు ఉత్తరకొరియానూ చైనా దారిలోకి తెచ్చిఉంటుందని విశ్లేషించారు. అయితే మౌనం వెనక అసలు కారణాన్ని ఉత్తరకొరియా మీడియా వెల్లడించింది. క్షిపణి పరీక్షలు నిలిపివేయడానికీ, యుద్ధ సన్నాహాలు విరమించడానికి కారణం అమెరికా హెచ్చరికలు, ప్రపంచ దేశాల ఒత్తిళ్లు కాదని ఉత్తరకొరియా తెలిపింది. అధ్యక్షుడు కిమ్ అనారోగ్యంతో బాధపడుతుండడం వల్లే క్షిపణి పరీక్షలు నిర్వహించడం లేదని స్పష్టంచేసింది. మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులతో కిమ్ బాధపడుతున్నారని తెలిపింది. దక్షిణ కొరియా స్పై ఏజెన్సీ కూడా ఈ వార్తలను నిర్దారించింది. అమెరికా, ఉత్తరకొరియా మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు కిమ్ అనారోగ్యం వల్ల కాస్త చల్లారాయి. దీన్ని అవకాశంగా తీసుకుని ఉత్తరకొరియాతో చర్చలు జరిపి సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని అమెరికాను పలు దేశాలు కోరుతున్నాయి. అటు ఆసియా పర్యటనలో భాగంగా చైనాలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు నిలిపివేశాలా ఒత్తిడి తేవాలని కోరారు. ట్రంప్ విజ్ఞప్తి తర్వాత చైనా అధ్యక్షుడి ప్రతినిధి సాంగ్ టావో ఉత్తరకొరియాలో పర్యటించారు. ఉత్తరకొరియా మౌనానికి కిమ్ అనారోగ్యమే కారణం