పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నమెంట్లో సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ చాంపియన్‌గా నిలిచాడు. కెనడా ఆటగాడు అన్‌సీడెడ్ డెనిస్ షపోవలోవ్ పై ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ విజయం సాధించాడు. విజేతగా నిలిచే క్రమంలో జొకోవిచ్ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా సమర్పించకపోగా రెండు సెట్లలో ఒక్కోసారి షపోవలోవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి సర్వీస్‌ను ఒక్కసారీ కూడా కోల్పోలేదు.
పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో చాంపియన్ జొకోవిచ్‌కు 1000 ర్యాంకింగ్ పాయింట్లు ఇంకా ప్రైజ్‌మనీ 995720 యూరోలు అక్షరాల 7 కోట్ల 84 లక్షలు రూపాయలు లభించాయి.
34వ మాస్టర్స్ సిరీస్ టైటిల్ ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ సాదించాడు. అత్యధిక మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ గెలిచిన ఆటగాళ్లలో రెండో స్థానంలో జొకోవిచ్ ఉండగా స్పెయిన్ ఆటగాడు రాఫెల్ నాదల్ 35 టైటిల్స్‌తో మొదటి స్థానంలో ఉన్నాడు.