ఆ ‘కొంతమంది’ పై తారక్‌ ఆగ్రహం… ఆ కొంత మంది ఎవరో తెలుసా?

NTR angry on review persons about Jai Lava Kusa Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎన్టీఆర్‌ మూడు విభిన్న పాత్రల్లో నటించిన ‘జైలవకుశ’ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు ఈ సినిమా సాధించబోతున్నట్లుగా ట్రేడ్‌ వర్గాల వారు సైతం విశ్లేషిస్తున్నారు. మొదటి మూడు రోజుల్లో ఏకంగా 75 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించిన ఈ చిత్రం మొదటి వారం రోజుల్లో 60 కోట్ల షేర్‌ను క్రాస్‌ చేయడం ఖాయం అంటూ ట్రేడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. సునాయాసంగా ఈ చిత్రం 100 కోట్ల షేర్‌ను దక్కించుకుని టాప్‌ చిత్రాల జాబితాలో నిలుస్తుందని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముందు నుండి అనుకున్నట్లుగా ఈ చిత్రం రికార్డు బ్రేకింగ్‌ కలెక్షన్స్‌ను సాధిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు.

ప్రేక్షకులు అందించిన సక్సెస్‌కు సంతోషంగా చిత్ర యూనిట్‌ సభ్యులు సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు గాను ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ స్థాయి విజయాన్ని ఊహించలేదని, ఇది ప్రతి ఒక్క అభిమానికి చెందుతుందని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు, మంచి కలెక్షన్స్‌ను సాధిస్తున్నా కూడా కొంత మంది మాత్రం సినిమా బాగాలేదు అంటున్నారు. సినిమాలో మ్యాటర్‌ లేదు అంటూ వారు చెబుతున్నారు. ఆ కొంత మంది గురించి నేను ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు. ఆ కొంత మంది ఎవరు అనేది అందరికి తెలిసిన విషయమే అంటూ ఎన్టీఆర్‌ వ్యాఖ్యలు చేశాడు.

ఈ సినిమాకు కొందరు బ్యాడ్‌ రివ్యూలు ఇచ్చారు. తక్కువ రేటింగ్‌ ఇవ్వడంతో పాటు, కథలో దమ్ము లేదని, ఎన్టీఆర్‌ మూడు పాత్రలతో సినిమా మొత్తం నెట్టుకు వచ్చాడని అన్నారు. సినిమాలో ఎన్టీఆర్‌ తప్ప మరెవ్వరు కనిపించలేదనే విమర్శలు కూడా కొందరు రివ్యూవర్స్‌ ఇచ్చారు. ఇది సాదారణ ప్రేక్షకులకు నచ్చడం కష్టమే అంటూ కొన్ని న్యూస్‌ ఛానెల్స్‌లో కూడా రివ్యూలు వచ్చాయి. కాని రివ్యూల గురించి పట్టించుకోకుండా ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి వారం రోజుల్లోనే 100 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించబోతున్న ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఆ కొంతమంది చేసిన వ్యాఖ్యలకు, రాసిన రాతలకు విలువ లేకుండా పోయిందని అంటున్నారు. ఎన్టీఆర్‌ ఆ కొంతమంది అంటూ రివ్యూవర్స్‌ను టార్గెట్‌ చేయడంతో కొందరు మీడియా మిత్రులు అసహనంను వ్యక్తం చేస్తున్నారు. ఎవరి అభిప్రాయం వారు చెబుతారు, ప్రేక్షకులు ఇష్టం అయితే సినిమా చూస్తారు అని అంటున్నారు.