Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బుల్లి తెరపై బిగ్‌బాస్ విపరీతమైన సందడి కొనసాగుతుంది. హిందీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న బిగ్‌బాస్ షో తెలుగు మరియు తమిళంలో ప్రసారం అవుతుంది. ఈ రెండు భాషల్లో కూడా ప్రేక్షకుల నుండి చక్కని ఆధరణ పొందుతుంది. నిన్న మొన్నటి వరకు తమిళ బిగ్‌బాస్ పై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇప్పుడు తెలుగు షోకు కూడా ఇబ్బందులు షురూ అయ్యాయి. బిగ్‌బాస్ షోలో నిర్వాహకులు అందులో పాల్గొనే కంటెస్టెంట్స్‌కు తీవ్రమైన శిక్షలు వేస్తున్నారు. ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మానవ హక్కుల సంఘంకు బిగ్‌బాస్‌పై ఫిర్యాదు చేయడం జరిగింది.
ఒక న్యాయవాది మానవ హక్కుల సంఘంకు ఇచ్చిన ఫిర్యాదులో బిగ్‌బాస్ తెలుగు షోలో పార్టిసిపెంట్స్‌ను దారుణంగా హింసిస్తున్నారు. చిన్న తప్పులకు పెద్ద శిక్షలు వేస్తున్నారు. ఇంగ్లీష్‌లో మాట్లాడారు అంటూ నోటికి ప్లాస్టర్, రూల్స్‌ను పాటించలేదని స్విమ్మింగ్ పూల్‌లో 50 సార్లు మునగమనడం ఇంకా ఉల్లిపాయలు తరమడం ఇలా ఎన్నో రకాలుగా పార్టిసిపెంట్స్‌ను బిగ్‌బాస్ నిర్వాహకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకుని షోను అర్థాంతరంగా ఆపేయాలంటూ డిమాండ్ చేయడం జరిగింది. ‘బిగ్‌బాస్’ షోకు వస్తున్న ఆధరణ కారణంగానే కొందరు ఇలాంటివి పుట్టిస్తున్నారని గేమ్ అన్నప్పుడు ఇలాంటివి చాలా కామన్ అని, ఎందుకు ఇలాంటి విషయాలను అతి చేస్తున్నారని బిగ్‌బాస్ షో నిర్వాహకులు అంటున్నారు.
మరిన్ని వార్తలు: