ఎన్‌టి‌ఆర్ నిడివి 4 గంటలు అనుకున్నారట!

ntr biopic movie four hours in theaters

తమిళ స్టార్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 2.ఓ ఈ చిత్రం విడుదలై మంచి విజయంను దక్కించుకుంది. మొదట ఈ చిత్రం యొక్క నిడివి మూడుగంటలు గా ఉండాలని శంకర్ ప్లాన్ చేశాడు. సూపర్ స్టార్ కి ఉన్న క్రేజీ దృష్ట్యా మూడు గంటలు ఉన్న సినిమా ఆడుతుంది. కానీ అంత సేపు ప్రేక్షకుడిని ధియేటర్ లో కూర్చోబెట్టె కథకూడా ఉండాలి లేకపోతె ఎంత సూపర్ స్టార్ అయినా సినిమా ప్లాప్ అవ్వకతపదు. 2.౦ కూడా సినిమాను 2 గంటల 18 నిమిషాలకు కుదించారు అదే మూడు గంటలు ఉంటే సినిమాకు ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే కచ్చితంగా పరిస్థితి వేరేలగా ఉండేది. కొన్ని చిన్న సినిమాలు నిడివి ఎక్కువగా ఉన్న కథలో మంచి కంటెంట్ స్క్రీన్ ప్లే బాగుంటే మూడు గంటలు ఉన్న అడుతాయి. క్రిష్ దర్శకత్వంలో, ఎన్టీఆర్ ముఖ్యపాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యొక్క నిడివి మొదట నాలుగు గంటలు గా నిర్ణయించాడు దర్శకుడు క్రిష్.

ఎన్‌టి‌ఆర్ నిడివి 4 గంటలు అనుకున్నారట! - Telugu Bullet

ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది కావునా ప్రతి ప్రేక్షకుడి మనసులో ఓ ములనా ఎన్టీఆర్ గురుంచి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుందనుకొని నాలుగు గంటలుగా నిర్ణయించాడు. కథ మద్యలో రెండు ఇంటర్వెల్ కుడా ఇవ్వాలని క్రిష్ భావించాడు. కానీ రెండు గంటలసేపు ప్రేక్షకుడిని ధియేటర్ లో కూర్చోబెట్టగలిగే స్క్రీన్ ప్లే, ప్లే చెయ్యాలి మరి. క్రిష్ మాత్రం నాలుగు గంటల నిడివి కన్న ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా విడుదల చేస్తేనే మార్కెట్ పరంగా, అనుకున్నది మొత్తం చూపించవచ్చు అనుకున్నారంట. ఈ విషయాని తాజాగా క్రిష్ చెప్పుకువచ్చాడు. అందుకనే ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా విడుదలవుతుంది. మొదటి భాగం కథానాయకుడు పేరుతో జనవరిలోను మరియు రెండోవ భాగం మహానాయకుడు అదేనెల చివరిలో విడుదల చేస్తున్నారు.