Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జైలవకుశ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్ వెనుక రాజకీయ కారణాలు వున్నాయన్న వాదన వినిపిస్తోంది. తండ్రి హరికృష్ణ ని ఉద్దేశిస్తూ ఈ జన్మకి మీ ఋణం తీర్చుకోలేను, అభిమానులతో ఉండి పోతాను అనడం వెనుక పాలిటిక్స్ కోణాన్ని చూస్తున్నారు కొందరు. టీడీపీ లో చంద్రబాబు తర్వాత తన కొడుకు పార్టీ బాధ్యతలు చేపట్టాలని హరికృష్ణ కోరికని అందరికీ తెలుసు. అయితే బాబు వ్యూహప్రతివ్యూహాల ముందు హరికృష్ణ కోరిక తీరేట్టు లేదు. ఎన్టీఆర్ కూడా ఈ విషయంలో కొన్ని లోపాయికారీ ప్రయత్నాలు చేసాక, పరిస్థితులు చూసాక అసలు విషయం అర్ధం చేసుకుని ఉండొచ్చు. అందుకే ఆరాధించే సినీ అభిమానుల్ని వదులుకుని పట్టు లేని పాలిటిక్స్ లోకి వెళ్లడం ఎందుకని అనుకుని ఉండొచ్చు. అదే విషయాన్ని తండ్రి హరికృష్ణకు అర్ధం అయ్యేలా చెప్పడానికి ఎన్టీఆర్ జైలవకుశ ఫంక్షన్ ని వేదికగా మార్చుకున్నట్టుంది.
ఇటీవల రాజకీయ పరిణామాలతో పాటు చంద్రబాబు, హరికృష్ణ ల మధ్య రాజీ కోసం కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు కుటుంబాలకు దగ్గర అయిన వాళ్ళు కొందరు ఈ రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆ రాజీ ప్రయత్నాలకు తలొగ్గి తండ్రికి రూట్ క్లియర్ చేయడానికి , తాను బాబు కుటుంబానికి అడ్డు తగలబోమని చెప్పేందుకు ఎన్టీఆర్ ఈ ప్రకటన చేసి ఉండొచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఇదే నిజం అయితే ఎన్టీఆర్ తన అభిమానులకి ఒకే సారి గుడ్ న్యూస్, బాడ్ న్యూస్ కలిపి చెప్పినట్టు అయ్యింది. గుడ్ న్యూస్ ఏమిటంటే… ఎన్టీఆర్ సినీ రంగంలో కొనసాగుతారు. బాడ్ న్యూస్ ఏమిటంటే… ఈ జన్మలో పాలిటిక్స్ కి ఎన్టీఆర్ దూరంగా ఉండటం.
మరిన్ని వార్తలు: