రాశిఖన్నాతో రిస్క్‌ వద్దన్న ఎన్టీఆర్‌

NTR reject to Rashi khanna dubbing in Jai Lava Kusa movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఎన్టీఆర్‌ మరో రెండు రోజుల్లో ‘జైలవకుశ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. మొదటి సారి ఎన్టీఆర్‌ మూడు విభిన్న పాత్రలు పోషించిన ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలను మాత్రం తగ్గకుండా దర్శకుడు బాబీ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్‌గా రాశిఖన్నా, నివేధా థామస్‌లు నటించారు, తమన్నా ఐటెం సాంగ్‌ను చేసింది. సినిమాకు ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు మరింత గ్లామర్‌ను అద్దడం ఖాయం అని ప్రేక్షకు భావిస్తున్నారు. 

ఇద్దరు హీరోయిన్స్‌ రాశిఖన్నా మరియు నివేదా థామస్‌లకు ఇదే పెద్ద సినిమా. ఇప్పటి వరకు చిన్న చిన్న సినిమాల్లో నటించిన వీరిద్దరు ఈ సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ రాశిఖన్నా ఈ సినిమాతో తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవాలని భావించింది. అందుకోసం తెలుగు పర్‌ఫెక్ట్‌గా నేర్చుకుంది. దర్శకుడు బాబీ కూడా ఈమెతో డబ్బింగ్‌ చెప్పించాలని భావించాడు. కాని ఎన్టీఆర్‌ మాత్రం రాశిఖన్నాతో డబ్బింగ్‌ చెప్పించేందుకు నిరాకరించాడు. ఈ సమయంలో, ఇలాంటి సినిమాలో ప్రయోగం అస్సలు వద్దు, సినిమా విడుదలకు దగ్గర పడుతుంది, రాశిఖన్నాకు గతంలో ఎవరైతే డబ్బింగ్‌ చెప్పారో వెంటనే ఆమెతో చెప్పించండి అంటూ బాబీకి సూచించాడు. దాంతో బాబీ ప్రయోగం మానేసి రాశిఖన్నాకు నో చెప్పాడు. రాశిఖన్నా డబ్బింగ్‌ కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి.