నిజంగా ఎన్టీఆర్‌ టాక్స్ ఎగవేశాడా?

NTR's Official Statement On Nannaku Prematho tax Issue

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ ప్రభుత్వంకు కట్టాల్సిన 1.2 కోట్ల పన్నును ఎగవేశాడు అంటూ కాగ్‌ నివేధిక ఇచ్చింది. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి ఎన్టీఆర్‌ తీసుకున్న పారితోషికం మొత్తానికి ఆయన పన్నును కట్టలేదని, ఆ విషయంలో ప్రభుత్వంను ఆయన మోసం చేశాడు అని కాగ్‌ పేర్కొంది. ఈ విషయాన్ని ఐటీ దృష్టికి కాగ్‌ తీసుకు వెళ్లడంతో ఎన్టీఆర్‌కు నోటీసులు పంపించినట్లుగా సమాచారం అందుతుంది. ఎన్టీఆర్‌ పన్ను కట్టాల్సిందిగా ఐటీ శాఖ కూడా నోటీసులు జారీ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. కాని ఎన్టీఆర్‌ మాత్రం తనకు ఎలాంటి నోటీసులు అందలేదు అని క్లారిటీ ఇచ్చాడు. 

పన్ను ఎగవేత విషయమై ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం షూటింగ్‌ మొత్తం విదేశాల్లో చిత్రీకరించడం జరిగింది. నాకు రావాల్సిన పారితోషికం కూడా విదేశీ సంస్థ ఇవ్వడం జరిగింది. ఆ కారణంగానే ఇండియాలో పన్ను కట్టాల్సిన అవసరం లేదని కొందరు ఐటీ నిపుణులు చెప్పడం వల్లే తాను ఆ చిత్రానికి సంబంధించిన పారితోషిం పన్ను చెల్లించలేదని ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చాడు. ఆ విషయాన్ని నా వ్యక్తిగత ఆడిటర్స్‌ ఐటీ శాఖకు నివేదించడం కూడా జరిగింది. తనకు పన్ను ఎగవేసే ఉద్దేశ్యం లేదని, తనకు పన్ను మినహాయింపు వచ్చినందునే తాను పన్ను చెల్లించలేదు అంటూ ఎన్టీఆర్‌ పేర్కొన్నాడు. ఎన్టీఆర్‌ పన్ను ఎగవేత విషయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది ఎన్టీఆర్‌కు ఒక మచ్చగా చెప్పుకోవచ్చు.

మరిన్ని వార్తలు:

ఇకపై అలా చేయను

దిల్‌రాజు అంచన తప్పింది

మంచు ఫిక్స్‌ అయ్యాడు