వీరిద్దరు ప్రేక్షకుల హృదయాలను గెల్చుకున్నారు

Karthika And Adharsh Getting Positive Response In Bigg Boss

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు బిగ్‌బాస్‌ ప్రేక్షకుల నుండి విపరీతమైన ఆధరణ దక్కించుకుంటుంది. స్టార్‌ మాటీవీ రేటింగ్‌, ఆ ఛానల్‌ స్థానం చూస్తుంటేనే విషయం అర్థం అవుతుంది. మొదటి రెండు వారాల్లోనే ఛానెల్‌ రేటింగ్‌ అమాంతం పెరిగి పోయింది. రోజులు, వారాలు గడుస్తున్నా కొద్ది షో ఆసక్తికరంగా సాగిపోతుంది. కొందరు ప్రేక్షకుల విమర్శలకు గురి అవుతుంటే మరి కొందరు మాత్రం రోజు రోజుకు ప్రేక్షకుల హృదయానికి దగ్గర అవుతున్నారు. నిన్న ప్రసారం అయిన ఎపిసోడ్‌లో వచ్చే వారంకు గాను కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసేందుకు ఓటింగ్‌ పక్రియ నిర్వహించిన విషయం తెల్సిందే. ఓటింగ్‌ సమయంలో ఆసక్తికర సంఘటన జరిగింది.

వచ్చే వారం కెప్టెన్సీ కోసం ఆదర్ష్‌, కార్తీక, ముమైత్‌లు పోటీ పడ్డారు. ఈ ముగ్గురిలో ఒకరిని బ్యాలెట్‌ ద్వారా ఎన్నుకోవాల్సిందిగా బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులను ఆదేశించడం జరిగింది. అందరు వారి వారి ఇష్టానుసారంగా ఓట్లు వేయడం జరిగింది. అయితే పోటీలో ఉన్న ఆదర్ష్‌ మరియు కార్తీకలు మాత్రం తమకు తాము ఓట్లు వేసుకోలేదు. ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపర్చుతూ ఆదర్ష్‌ తన ఓటును కార్తీకకు వేయడం జరిగింది. ఆమె ఖచ్చితంగా ఇంటిని బాగా చూసుకుంటుందనే నమ్మకం తనకు ఉందని అతడు అభిప్రాయ పడ్డాడు. ఇక కార్తీక కూడా తన ఓటు తనకే వేసుకోకుండా ఆదర్ష్‌కు వేయడం జరిగింది. ఈ సమయంలో బిగ్‌బాస్‌కు ఆయన కెప్టెన్సీ అవసరం అని తాను భావిస్తున్నట్లుగా కార్తీక ఓటు వేసింది. ఈ కెప్టెన్సీ ఎన్నికల్లో ఆదర్ష్‌ గెలిచినా కూడా కార్తీక కూడా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. వీరిద్దరిపై ప్రేక్షకుల్లో ఇప్పటికే సదాభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం కాస్త బలపడటం జరిగింది.

మరిన్ని వార్తలు:

వంశీ పరువు తీసిన వర్మ