ఇకపై అలా చేయను

Mega Hero Quit Smoking and Teasing Heroines

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కొంత కాలం క్రితం సినిమాల్లో హీరోలు తమ హీరోయిజంను చూపించుకునేందుకు సిగరెట్లు గుప్పు గుప్పు మంటూ తాగే వారు. కాని ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఒప్పుడు మహేష్‌బాబు తన ప్రతి సినిమాలో కూడా సిగరెట్లు తాగుతూ కనిపించేవాడు. కాని ఇటీవల మహేష్‌బాబు పూర్తిగా సిగరెట్లను వదిలేశాడు. ఇంకా పలువురు హీరోలు కూడా సినిమాల్లో సిగరెట్లను మానేస్తున్నారు. అదే దిశగా మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కూడా తాను సినిమాల్లో ఇకపై సిగరెట్లు తాగుతూ కనిపించను అంటూ క్లారిటీగా చెప్పేశాడు. సినిమా కథకు అవసరం ఉన్నా కూడా తాను మాత్రం సిగరెట్లు తాగేది లేదు అంటూ దర్శకులకు చెప్పేస్తాను అన్నాడు. 

సిగరెట్లతో పాటు సినిమాలో చాలా కీలకం అయితేనే మందు సీన్స్‌ను చేస్తాను అని, అవసరం లేకున్నా కూడా మందు తాగను అంటూ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో సినిమాలో అమ్మాయిలను ఏడిపించడం, అమ్మాయిలతో అల్లరి చిల్లరిగా ప్రవర్తించడం చేయను అంటూ కూడా ప్రకటించాడు. సినిమాల్లో హీరోలు చేస్తున్నారని రోడ్లపై కుర్రాల్లు కూడా అమ్మాయిల విషయంలో తప్పుగా ప్రవర్తిస్తున్నారు. సినిమాల్లో చూపించడం మానేయాలని కోరుతున్నారు. అందుకే స్టార్‌ హీరోలు అలాంటి సీన్స్‌ను చేయవద్దని భావిస్తున్నారు. అందులో సాయి ధరమ్‌ తేజ్‌ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభినందనీయం

మరిన్ని వార్తలు:

మంచు ఫిక్స్‌ అయ్యాడు

‘నేనే రాజు నేనే మంత్రి’కి అదిరిన బిజినెస్‌

దిల్‌రాజు అంచన తప్పింది