Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇంకో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు. తెలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా కలిసి వస్తున్నాయి. ఈ సందర్భంలో మీడియా మేనేజ్ మెంట్ ఏ పార్టీకైనా అవసరం అయిన పని . ఈ విషయంలో అందరికంటే సీఎం చంద్రబాబు నాలుగు ఆకులు ఎక్కువే చదివారు అని ఎప్పటి నుంచో ఓ టాక్. ఆ మాటని నిజం చేసే విషయం ఒకటి ఇప్పుడు అమరావతి పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తున్న మాట. ఈ మధ్య టీవీ 9 తరచుగా కత్తి మహేష్ ని కూర్చోబెట్టి పవన్ తో పాటు చంద్రబాబు సర్కార్ ని ఏకిస్తోంది. ఇక ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి పరిస్థితులు ఎలా వుంటాయో అన్న భయం టీడీపీ కి లేకపోలేదు.
టీవీ 9 మీద పూర్తిగా ఆధారపడలేమన్న చంద్రబాబు ఆలోచనకు తగ్గట్టు అదే సమయంలో ఎన్ టీవీ చౌదరి ముందుకు వచ్చారట. తమకు అండగా నిలిస్తే టీడీపీ కి పూర్తి స్థాయిలో మద్దతు పలకడానికి రెడీ అన్నారట. కిందటి ఎన్నికల ముందు , తరువాత కూడా టీడీపీ కి వ్యతిరేకంగా , జగన్ కి అండగా ఎన్ టీవీ గట్టి గా నిలబడింది. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు కూడా పడింది. కొమ్మినేని లాంటి సీనియర్ జర్నలిస్ట్ ని వదులుకుంటే గానీ పరిస్థితి మెరుగు పడలేదు.
ఎన్ టీవీ రాజీపడినప్పటికీ టీడీపీ ఆ ఛానల్ ని పూర్తిగా విశ్వసించలేని పరిస్థితికి కారణం లేకపోలేదు. అదే వైసీపీ అధినేత జగన్ తో చౌదరి స్నేహ సంబంధాలు. కానీ ఆ బంధంలో ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు గానీ తాజాగా విజయవాడ వచ్చిన చౌదరి రహస్యంగా చంద్రబాబుతో భేటీ అయినట్టు సమాచారం. ఛానల్ ని పూర్తి స్థాయిలో టీడీపీ కి మద్దతుగా నడుపుతానని ఆయన ఇచ్చిన హామీతో బాబు సంతృప్తి చెందినట్టు తెలుస్తోంది. అందుకు ప్రతిగా బాబు ఏమి చేస్తారో బయటకు రాలేదు. చౌదరి ప్లేట్ ఫిరాయించడం నిజం అయితే వైసీపీ అధినేత జగన్ రాష్ట్రాల్లో ఇంకొకటి చేజారినట్టే.