కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్నే వణికించేస్తుంది. దీంతో ఇండియా ప్రధానమంత్రి మోడీ దేశమంతా ఏప్రిల్ 14వరకు లాక్ డౌన్ లో పెట్టారు. కరోనా వ్యాప్తి చెందకుండా మరింత చర్యలు తీసుకొనేలా ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాలను మోడీ అప్రమత్తం చేస్తున్నారు.
అయితే ఇప్పుడు అందరి దృష్టి ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ కొనసాగుతుందా లేకా లాక్ డౌన్ ఎత్తేస్తారా అన్న అంశంపైనే ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఈ విషయంపై ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతోనూ, అన్ని రాజకీయ పార్టీల పార్లమెంటటీ ఫ్లోర్ లీడర్లతోనూ సుదీర్ఘంగా చర్చించారు. ఇదే విషయంపై మరోసారి చర్చించుకొని నర్ణయం తీసుకోవాలని ఆయా నాయకులను మోడీ కోరారు.
ఇదిలా ఉంటే.. తాజాగా కాసేపటి క్రితమే కేబినేట్ బేటీ నిర్వహించిన ఒడిశా ప్రభుత్వం ఏప్రిల్ 30వరకు లాక్ డౌన్ కొనసాగించాలని దేశంలోనే తొలిసారిగా నిర్ణయం తీసుకుంది.
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. ఏప్రిల్ 30వరకు రైళ్లుగానీ, విమామాలు గానీ తిరగకుండా ఉంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హాట్ స్పాట్ ను గుర్తించి రికార్డ్ స్థాయిలో లక్ష వరకు కరోనా టెస్ట్ లు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను జాన్ 17వరకు మూసివేయాలని కేబినేట్ లో నిర్ణయం తీసుకున్నారు. అత్యవసరాలైన వ్యవసాయం వంటి పనులకు సంబంధించి సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు. అలాగే ఎప్పటివలెనే గూడ్స్ వంటి అత్యవసర విభాగాలను కొనసాగింపు ఉండనుంది. ప్రజలంతా ఇది గమనించి కరోనా వైరస్ తీవ్రతను గుర్తించి మలుచుకోవాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. మొత్తానికి ఏప్రిల్ 30వరకు లాక్ డౌన్ అమలును ప్రకటించిన తొలి రాష్ట్రంగా ఒడిశా గుర్తింపు పొందడం విశేషం.