బాబాయ్ తో పాటు 14మంది…28 రోజులపాటు రేప్…!

Odisha Girl Gangraped Over 28 Days

ఎన్ని చట్టాలొచ్చినా అత్యాచారాలు ఆగడం లేదు. దేశంలో గంట గంటకీ ఏదో ఒక ఘటన నమోదవుతూనే ఉంది. నిన్న హర్యానా, డెహ్రాడూన్‌లో అత్యాచార ఘటనల్ని మర్చిపోకముందే ఒడిశాలో మరో ఘటన జరిగింది. సొంత బాబాయ్ సహా పద్నాలుగు మంది ఓ యువతిని కిడ్నాప్ చేసి 28 రోజులు అత్యాచారానికి పాల్పడి ఆమెను చెరువులో విసిరేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్న బాధితురాలు జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పడంతో ఘటన వెలుగులోకివచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం ఒడిశాలోని రౌతాయార్‌పూర్‌కు చెందిన యువతి కిందటి నెలలో మధుబన్ బజార్‌కు వెళ్లింది. ఆమె బజారుకు వెళ్లడాన్ని పసిగట్టిన కొందరు ఆమెను కిడ్నాప్ చేశారు. ఆమెను ఊరి శివారులో ఉన్న ఓ గదిలో బంధించారు. అప్పటి నుంచి బాధితురాలి మీద అత్యాచారానికి పాల్పడుతున్నారు. దాదాపు 28 రోజుల పాటూ ఆమెపై అత్యాచారం చేస్తూనే ఉన్నారు. తర్వాత ఆమెను తీసుకెళ్లి పక్కనే ఉన్న ఓ చెరువులో పడేసి వెళ్లి పోయారు.

gang-rape
దీంతో ఆమె ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంది. నేరుగా ఊరిలోకి వెళ్లి జరిగిన దారుణాన్ని స్థానికులకు చెప్పింది. వారి సాయంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. యువతి పై అత్యాచారానికి పాల్పడినవారిలో ఆమెకు వరుసకు బాబాయి అయ్యే వ్యక్తితో పాటూ 14మంది ఉన్నట్లు తెలుస్తోంది. యువతి కనిపించకుండా పోవడంతో ఆగష్టు 20న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగానే యువతి ఇలా అత్యాచారానికి గురికావడంతో కలకలంరేపింది.

gangrape-in-odissa