తెలుగు కంటే ముందే తమిళ్ లో ఓహ్ బేబీ

oh baby is in tamil earlier than telugu

హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబీ సినిమా ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కొరియన్ సినిమా మిస్ గ్రానీ్కి రీమేక్ గా దీన్ని దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సమంత నటించిన ఓ బేబీ సినిమాకు తమిళ ప్రభుత్వం అరుదైన గౌరవం ఇచ్చింది. ఈ సినిమాను ఉదయం 8 గంటలకు(ఎర్లీ మార్నింగ్ షో) ప్రదర్శించేందుకు అనుమతి లభించింది. చెన్నైలోని ప్రఖ్యాత జీకే సినిమాస్ థియేటర్ లో ఓ బేబీ సినిమా స్పెషల్ షో వేస్తున్నారు. అంటే తెలుగు కంటే తమిళంలోనే ఓ బేబీ ముందుగా రిలీజ్ కాబోతోందన్న మాట. అయితే స్వతహాగా మలయాళీ అయిన సమంత పుట్టి పెరిగింది చెన్నైలోనే కావడం గమనార్హం. ఇక అక్కడ ఆమెను తలైవీ అని పిలుచుకుంటున్నారు తమిళ తంబీలు.