ఓ బేబి స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్.. ప‌టాకులు పేల్చి డ్యాన్స్ చేసిన టీం

oh baby success celebrations

క‌థల ఎంపికలో వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రయోగాత్మక ఇతివృత్తాల్ని ఎంచుకుంటున్న స‌మంత తాజాగా ఓ బేబి అనే చిత్రం చేసిన సంగ‌తి తెలిసిందే. కొరియన్ చిత్రం మిస్‌గ్రానీకి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. త‌ను పోషించిన పాత్ర‌లో స‌మంత‌ని త‌ప్ప మ‌రొకరిని ఊహించుకోలేనంత గొప్పగా సమంత అద్భుతాభినయాన్ని ప్రదర్శించింది. వృద్ధురాలైన బేబీ పాత్రలో లక్ష్మి పరకాయప్రవేశం చేసింది. రావు రమేష్, రాజేంద్రప్రసాద్ తమ పాత్రలకు పరిపూర్ణంగా న్యాయం చేశారు. ప్రథమార్థంలో సమంత, రాజేంద్రప్రసాద్ మధ్య వచ్చే సన్నివేశాల్లో చక్కటి వినోదం పండింది. పతాకఘట్టాల్లో సమంత, రావురమేష్ మధ్య సీన్స్ హార్ట్‌టచింగ్‌గా సాగాయి. తెలుగు రాష్ట్రాల‌లోనే కాక విదేశాల‌లోను ఈ చిత్రానికి మంచి వ‌సూళ్ళు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఓబేబి స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌ని రామానాయుడు స్టూడియోలో జ‌రిపారు. రామానాయుడు స్టూడియో ముందు ప‌టాకులు పేల్చి తీన్‌మార్ ఆడారు. ఆ త‌ర్వాత స‌మంతతో కేక్ క‌ట్ చేయించారు. యుఎస్ లో ఈ సినిమా కేవలం ప్రీమియర్‌లో 1,45,135 డాలర్లు రాబట్టిందని ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు. ఈ ఏడాది టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు(ప్రీమియర్‌) సాధించిన ఆరో చిత్రంగా ఓ బేబి నిలిచిందని పేర్కొన్నారు.