తమిళ స్టార్ డైరక్టర్ శంకర్ రోబోకి సీక్వెల్ గా 2.౦ తెరకెక్కించి మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ తో భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు 2 చిత్రాని తీసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఈ నెల 14 నుండి సెట్స్ పైకి వెళ్లనున్నది. ఈ చిత్రం తరువాత మరో చిత్రానికి సీక్వెల్ చెయ్యాలని శంకర్ ఓ సందర్బంలో చెప్పాడు. రెండు దశాబ్దాల క్రితం వచిన్న ఒకే ఒక్కడు చిత్రానికి సీక్వెల్ తీసే ఆలోచలనలో ఉన్నాడు. యాక్షన్ కింగ్ ఆర్జున్ నటించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయంను దక్కించుకుంది. ఇప్పుడు ఒకే ఒక్కడు చిత్రానికి సీక్వెల్ లో ఆర్జున్ స్థానంలో రజినీకాంత్ కానీ, కమల్ ను కానీ నటిస్తే భాగుంటుందని శంకర్ భావిస్తునాడని అతని మాటల ద్వారా తెలుస్తుంది.
విజయ్ కూడా ఒకే ఒక్కడు చిత్రానికి సీక్వెల్ లో కరెక్ట్ గా సెట్ అవ్వుతాడు. ఈ మధ్యకాలంలో విజయ్ తీసినా సినిమాలు మొత్తం సోషల్ మెసేజెస్ తో కూడిన చిత్రాలు. కావునా ఒకే ఒక్కడు చిత్రానికి విజయ్ కరెక్ట్ గా సూట్ అవ్వుతాడు. తెలుగు,లో కూడా విజయ్ కి మంచి సినిమా మార్కెట్ ఏర్పడింది, అందులో ఒకే ఒక్కడు చిత్రం తెలుగు నాట అప్పట్లో రికార్డ్స్ బ్రేక్ చేసింది కావున ఇప్పటి జనరేషన్ కి విజయ్ భాగసేట్ అవ్వుతాడు. కానీ ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళాలి అంటే 2020 వరకు అగాలిసిందే. శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ తో భారతీయుడు 2 చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులతో చాలా బిజీగా ఉన్నాడు. కమల్ సరసన కథానాయకగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నది. కీలక పాత్రలో దుల్కర్ సల్మాన్, శింభు నటిస్తున్నారు. లైక ప్రొడక్షన్స్ ఈ చిత్రాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నది.