ఓంకార్‌ మళ్లీ నెం.1

omkar sixth sense show holds a record-level TRP rating

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఒక మ్యూజిక్‌ ఛానెల్‌లో చిన్న యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఓంకార్‌ అతి తక్కువ సమయంలోనే చాలా ఫేమస్‌ అయ్యాడు. జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారం అయిన ఆట మరియు జీనియస్‌ షోలతో ఓంకార్‌ ప్రతి ఇంట్లో కూడా అన్నయ్యగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓంకార్‌ అన్నయ్య అంటూ అందరు పిల్చుకునే ఈయన ఆమద్య సినిమాలకు వెళ్లి పోయాడు. వరుసగా చిత్రాలకు దర్శకత్వం వహించిన నేపథ్యంలో ఓంకార్‌ ఇక బుల్లి తెరపైకి రాడు అని అంతా భావించారు. కాని ఓంకార్‌ అనూహ్యంగా బుల్లి తెరపైకి ‘సిక్త్స్‌ సెన్స్‌’ కార్యక్రమంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

బుల్లి తెరపై సంచలనాలకు పేరుగా నిలిచిన ఓంకార్‌ తాజాగా ఈ షోతో కూడా మరోసారి తన సత్తా చాటాడు. తెలుగులో ఎన్నో గేమ్‌ షోలు, రియాల్టీ షోలు ప్రసారం అవుతున్నాయి. వాటన్నింటిలోకి కూడా ఓంకార్‌ షో నెం.1గా నిలిచింది. అర్బన్‌ మరియు రూరల్‌ ప్రాంతాల్లో ఈ గేమ్‌ షో రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం శని, ఆదివారాల్లో స్టార్‌ మాటీవీలో ప్రసారం అవుతున్న ఆ షో ద్వారా స్టార్‌ మాటీవీ విపరీతమైన టీఆర్పీ రేటింగ్‌ను పొందుతున్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి చాలా గ్యాప్‌ తర్వాత వచ్చినా కూడా ఓంకార్‌ నెం.1గా నిలిచాడు. ఈ గేమ్‌ షో తర్వాత మళ్లీ సినిమాలతో ఓంకార్‌ బిజీ అవ్వనున్నాడు.