రాజుగారి గ‌ది నుండి త‌మ‌న్నా ఔట్‌..!

Tamanna out from raju gaari gadhi

బుల్లితెర నుండి వెండితెర‌కి ఎంట్రీ ఇచ్చిన ఓంకార్ ద‌ర్శ‌కుడిగా రాణిస్తున్నాడు. ఆయ‌న తెర‌కెక్కించిన రాజుగారి గ‌ది చిత్రం మంచి విజ‌యం సాధించ‌డంతో ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాజుగారి గ‌ది 2చేశాడు. మలయాళ చిత్రం ప్రేతమ్‌ను స్ఫూర్తిగా తీసుకొని హారర్ కామెడీ కథాంశానికి సందేశం, హీరోయిజం, కుటుంబ బంధాలను జోడించి దర్శకుడు ఓంకార్ ఈ సినిమాను రూపొందించారు. సమస్యలపై పోరాటం చేయాలే తప్ప జీవితాల్ని ముగించుకోవాలనుకోకూడదనే సందేశంతో తెరకెక్కిన చిత్రమిది. రీసెంట్‌గా రాజుగారి గ‌ది 3 చిత్రానికి కూడా శ్రీకారం చుట్టాడు. ఇందులో త‌మ‌న్నాని ప్ర‌ధాన పాత్ర‌కి ఎంపిక చేశాడు. అశ్విన్‌ బాబు హీరోగా నటిస్తున్న ఈసినిమాలో ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, హరితేజ, ప్రభాస్‌ శ్రీను, అజయ్‌ ఘోష్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓంకార్ స్వీయ నిర్మాణంలో రూపొంద‌నున్న ఈ చిత్రానికి బుర్రా సాయి మాధవ్ చిత్రానికి డైలాగ్స్ అందిస్తుండ‌గా, చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌న‌కు చెప్పిన స్క్రిప్ట్‌, ఇప్పుడు ఉన్న స్క్రిప్ట్‌లో మార్పులుండ‌టంతో త‌మ‌న్నా ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. త‌మ‌న్నా స్థానంలో తాప్సీని తీసుకోవాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది.