సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు..

punished if wrong campaign in social media

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సోమవారం హెచ్చరించారు. 11 నెలల కింద ఓ ఫేసుబుక్ ఖాతాదారుడు పోలీసులంటే కూడా విలువు లేకుండా పోయింది. ఒక ఎమ్మెల్సీ కొడుకు అంట కాళ్లు పట్టుకుంటేనే ఎస్‌ఐని వదిలేస్తాడంట పాపం ఎలా కొట్టారో చూడండి అని వీడియో పోస్టు చేశాడు.అయితే ఈ ఘటన తెలంగాణలో జరగలేదు. కొంత మంది యువకులు మద్యం మత్తులో అటవీ శాఖ అధికారుల పై దాడి చేసిన ఘటన పై ఏపీ పోలీసులు కేసు నమోదు చేసుకొని అప్పట్లోనే అరెస్టు చేశారు. ఆ పాత వీడియోను ఇప్పుడు కొంతమంది పని గట్టుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ అనవసర పుకార్లను పుట్టిస్తున్నారు.దీనిని నిజమేనని నమ్మి చాలా మంది తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని సీపీ సజ్జనార్ వివరించారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై పౌరులు సైబరాబాద్ వాట్సాప్ 9490617444కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.