ప్రపంచంలోనే అతిచిన్న కెమెరా

ప్రపంచంలోనే అతిచిన్న కెమెరా

ఓమ్నివిజన్ టెక్నాలజీస్ మొబైల్ ఫోన్లు, నోట్‌బుక్‌లు మరియు వెబ్‌క్యామ్‌లు, భద్రత మరియు నిఘా కెమెరాలు, వినోదం, ఆటోమోటివ్ మరియు మెడికల్ ఇమేజింగ్ వ్యవస్థల్లో ఉపయోగం కోసం అధునాతన డిజిటల్ ఇమేజింగ్ టెక్నాలజీలను మరియు ఉత్పత్తులను రూపొందించే మరియు అభివృద్ధి చేసే సంస్థ.

కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో ఓమ్ని విజన్ టెక్నాలజీస్ ప్రధాన కార్యాలయం ఉన్నది. ఓమ్ని విజన్ టెక్నాలజీస్  యుఎస్ఎ, వెస్ట్రన్ యూరప్ మరియు ఆసియాలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 5డిజైన్ సెంటర్లు ఉన్నాయి.

ఓమ్నీ విజన్ ప్రపంచంలోని అతి ఆధునిక ఇంకా అతి చిన్న కెమెరాని తయారు చేసింది. హై ఎండ్ ఫెసిలిటీస్తో తయారైన ఈ కెమెరా గిన్నిస్ రికార్డును కూడా సృష్టించింది. మిల్లీ మీటర్ కన్న తక్కువ ఉండి 0.65 మిల్లీ మీటర్ల వెడల్పు లో ఉంది.

వైద్య రంగంలో ముఖ్యంగా ఆపరేషన్ల సమయంలో ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు. దీని పేరు “ఓవీఎం6948”.200/200 పిక్సెల్స్ రెజల్యూషన్ ఇంకా 120డిగ్రీల వైడ్యాంగిల్ వ్యూ కలిగి ఉంది.తక్కువ వెలుతురు ఉన్నా స్పష్టమైన ఫోటోలను తీసే సామర్థ్యం ఈ కెమెరా కి ఉంది.