సామాన్యులు ఉల్లిపాయలు కొనాలంటే ఆలోచించాల్సి వస్తుంది. కేజీ ఉల్లి ఏకంగా 220 రూపాయలకు బంగ్లాదేశ్లో అమ్ముతున్నారు. వినియోగదారులు ఏక కాలంలో పెరిగిన ధరలని చూసి ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం మన దేశం నుంచి దిగుమతి ఆగిపోవడం వల్లనే బంగ్లాదేశ్లో ఉల్లిపాయల ధరలు పెరిగాయి.
టర్కీ, ఈజిప్ట్, చైనా వంటి దేశాల నుంచి విమానాల ద్వారా ఉల్లి దిగుమతి చేసుకుంటోంది. తక్కువ ధరకే ఉల్లిపాయలు అందించే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం స్పందించి పలు చోట్ల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసి 38 రూపాయలకే అందించాలని చూస్తుంది. ప్రధాని షే హసినా తన నివాసంలో ఉల్లి వాడకంపై నిషేధం విధించి, ఉల్లి వాడకుండా వంటలు తయారుచేశారని స్థానిక మీడియా వెల్లడించింది.
ఇంకా మన దేశంలోనూ ఉల్లిపాయల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. మంచి ఉల్లి కిలో 70 రూపాయల వరకు ఉంది. బహిరంగ మార్కెట్లలో చాలా ధరకే వినియోగదారులు అమ్ముతున్నారు. ధరలు ఎక్కువగా ఉన్న పాలకులు అయితే పట్టించుకోవడం లేదు.
మరో రెండు నెలల పాటు ఇవే ధరలు కొనసాగే అవకాశముందని, వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడం వల్ల ఉల్లిపాయలు ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. వెల్లడించారు. వినియోగదారులు ధరల పెరుగుల వల్ల తక్కువగానే కొనుగోలు చేస్తున్నారని చెప్తున్నారు.