ఒక భర్తకు ఇద్దరు, లేదా ముగ్గురు భార్యలుండటం ఇప్పటివరకు చూశాం. అయితే ఇప్పుడు ఓ వింత వార్త వినాల్సి వస్తుంది. ఇంతకు ముందెన్నడూ కూడా ఒక భార్యకు ఇద్దరు, ముగ్గురు, అంతకంటే ఎక్కువ భర్తలు ఉండటం చూడలేదు. అయితే అప్పుడప్పుడు ఒక్కో అమ్మాయి.. ముగ్గురు లేదా నలుగురు ఆపై పలువుపు అబ్బాయిలను మెయింటైన్ చేస్తుండేది అని విన్నాం. అయితే మహాభారతంలో ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉంటారు. అది పురాణం కాబట్టి వినడానికి బాగుంటుంది. కానీ..
రియల్ లైఫ్ లో ఇలాంటి విషయాలు చాలా భయంకరంగా ఉంటాయి. మన సంప్రదాయం ప్రకారం ఇలాంటి వాటిని నేరంగా భావిస్తారు. కానీ.. నేపాల్ లోని ఓ ప్రాంతంలో దీనిని ఆచారంగా పాటిస్తూ వస్తున్నారు. నేపాల్ లోని ఉత్తర ప్రాంతంలో ఉండే డొల్పాలో ఈ సంప్రదాయం కొనసాగుతున్నది. వందలాది సంవత్సరాలుగా ఈ సంప్రదాయం అక్కడ ఉంది. ఇది చైనా సరిహద్దు ప్రాంతం కావడంతో చైనాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే సంప్రదాయం అమలులో ఉంది.
అయితే ఒక కుటుంబంలోని సోదరుల్లో పెద్ద సోదరుడు వివాహం చేసుకున్న యువతిని మిగిలిన సోదరులు కూడా వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత ఆమె ఆ ఇంట్లో ఉండే సోదరులందరికీ కూడా భార్యగా ఉంటుంది. అలాగే కుటుంబాన్ని పోషించే బాధ్యత, డబ్బుపై అధికారం ఆమెకు ఉంటుంది. భర్తలు పనిచేసి డబ్బు సంపాదించి ఆ బార్యకు ఇవ్వాలి. ఆమెపై లైంగికంగా అందరికీ సమాన హక్కులు ఉంటాయి. అయితే పేదరికం కారణంగా ఇలాంటి సంప్రదాయం పాటిస్తున్నారని తెలుస్తోంది.
ఒక భర్త మరణిస్తే మరో భర్త ఉంటారు.. కాబట్టి ఇంట్లో భార్య ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటుంది. కానీ.. విచిత్రమేమిటంటే… ఈ సంప్రదాయాన్ని ఇంకా కూడా అక్కడి ప్రజలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇక్కడున్న ఓ ట్విస్ట్ ఏమిటంటే.. ఒకరికంటే ఎక్కువ సోదరులు ఉండే ఇంటికే అమ్మాయిని పంపించేందుకు తల్లిదండ్రులు మొగ్గుచూపుతుండటం.