శ్రీకాంత్ హీరో గా, బాబ్జీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఆపరేషన్ 2019. ఈ చిత్రం ప్రేక్షకుల మనసును గెలుచుకొన్ని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఫాన్స్ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు ఈ చిత్రం పైన, చిత్ర దర్శకుడి పై ఆగ్రహం తో ఉన్నారు. ఆపరేషన్ 2019 మూవీ లో శ్రీకాంత్ చెప్పిన ఓ డైలాగ్ ” మాసిన గడ్డం తో తిరుగుతే ఓట్లు రాలవు అన్న డైలాగ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అపదిస్తునట్టు ఉన్నది అని పవన్ ఫాన్స్ సీరియస్ గా ఉన్నారు. దీనికి సమాధానంగా దర్శకుడు బాబ్జీ ఆ డైలాగ్ వచ్చే సందర్బం ఏమిటో చూసి మాట్లాడాలని అన్నారు. కొందరు కావాలనే ఇలాంటివి పుట్టిస్తారు అని అలాంటి వాటికీ నేను బయపడను. తప్పు చేసేవారు మాత్రమే బయపడుతారు అని అన్నారు.
ఈ సినిమా రివ్యూస్ పైన అయన మండి పడ్డారు. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సు వస్తుంటే రివ్యూస్ మాత్రం తన సినిమాకు వ్యతిరేకంగా రాస్తున్నారు అన్నారు. ఈ సినిమాను ఓ దర్శకుడి గా నేను తియ్యలేదు. ఓ బాధ్యతగల పౌరుడిగా తీశాను. రాజకీయాలలో మార్పు రావాలి అంటే ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కుతో మార్పును తీసుకు రావచ్చు అన్నారు. అంతేగాకుండా ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తో తీసి ఉంటె బాగుంటుందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు, అసలు పవన్ నాకు డేట్స్ ఇస్తాడా అని ఎదురు ప్రశ్నించాడు. దయచేసి ఆ విషయాని ఇంతటితో వదిలేయండి మరి రాద్దాంతం చెయ్యవద్దు అన్నారు. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అన్నాడు.