Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా సహా విభజన హామీలు ఎగ్గొట్టడం చాలా చిన్న విషయం అని భావించిన ప్రధాని మోడీకి తాను చేసింది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు బాగా అర్ధం అయ్యింది. వైసీపీ ని ఎటూ మేనేజ్ చేస్తాం కాబట్టి కేవలం టీడీపీ కి చెందిన 16 మంది ఎంపీలు ఏమి చేయగలరుకే అని ఆయన అనుకున్నారు. అలాగే వ్యవహరించారు కూడా. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఢిల్లీలో మోడీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఎలా తుంగలో తొక్కారో వీడియో ప్రెసెంటేషన్ ఇచ్చాక కూడా అదే ధోరణిలో వెళ్లారు. పైగా చంద్రబాబుని ఏ పెద్ద స్థాయి నాయకుడు కూడా కలవలేదని చెప్పేందుకు బీజేపీ ఉవ్విళ్లూరింది. కానీ మోడీ అనుకున్నది ఒక్కటి అయింది ఇంకొక్కటి.
వరసగా 12 వ రోజు కూడా అన్నాడీఎంకే సభ్యులు వెల్ లోకి రావడంతో ఎప్పటిలాగానే లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ఎప్పటిలాగానే వాయిదా వేసుకెళ్లారు. అయితే టీడీపీ తో పాటు అవిశ్వాస తీర్మానం ఇచ్చిన వివిధ పార్టీలు ఈసారి మౌనంగా ఊరుకోలేదు. పార్లమెంట్ వేదికగా ఎన్నడూ లేని రీతిలో మానవహారం ఏర్పాటు చేశారు. రాజ్యసభ చైర్మన్ కార్యాలయం నుంచి ప్రధాని కార్యాలయం దాకా నిర్వహించిన మానవహారం లో విపక్ష పార్టీలన్నీ పాల్గొన్నాయి. ఒక్క వైసీపీ తప్ప. అవిశ్వాస నోటీసు ఇచ్చిన వైసీపీ ఇలా మానవహారం పాల్గొకుండా మొహం చాటేయడంతో చంద్రబాబు చెప్పినట్టు ఆ పార్టీని మోడీ ఆడిస్తున్నారని దేశమంతా అర్ధం అయ్యింది. ఇక మోడీ, జగన్ లు చంద్రబాబు కోసం తవ్విన గుంతలో తామే పడి దాని నుంచి ఎలా బయటకు రావాలో అర్ధం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు.