Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాలకృష్ణ డబుల్ రోల్‌లో నయనతార, నటాషా, హరిప్రియ హీరోయిన్స్‌గా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జైసింహా’. సంక్రాంతి సందర్బంగా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంను కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపడం లేదని, దాంతో నిర్మాత సి కళ్యాణ్ అన్ని ఏరియాల్లో తానే స్వయంగా విడుదలకు సిద్దం అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం సినిమాపై ఉన్న నమ్మంతో కావాలని నిర్మాత సి కళ్యాణ్ ‘జైసింహా’ ఓన్ రిలీజ్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆ విషయం పక్కన పెడితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘జైసింహా’ చిత్రం ఓవర్సీస్‌లో విడుదల అవ్వడం కష్టమే అంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
తెలుగు సినిమాలకు ఇటీవల ఓవర్సీస్‌లో మంచి క్రేజ్ ఉంది. చిన్న పెద్దా అనే తేడా లేకుండా ఓవర్సీస్‌లో తెలుగు సినిమాలు సునాయాసంగా మిలియన్ మార్క్‌ను అందుకుంటున్నాయి. తాజాగా ‘జైసింహా’ కూడా అక్కడ విడుదల చేసి కలెక్షన్స్‌ను రాబట్టాలని నిర్మాత భావించాడు. అయితే బాలయ్య గత చిత్రాల ట్రాక్ రికార్డు దృష్ట్యా ఎవరు కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపడం లేదట.
దాంతో ఓవర్సీస్‌లో కూడా సి కళ్యాణ్ సొంతంగా విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడని, కాని ‘అజ్ఞాతవాసి’కి ఎక్కువ సంఖ్యలో స్క్రీన్ ముందే బుక్ అవ్వడం వల్ల జైసింహా కోసం థియేటర్‌లు లభించడం లేదు అంటూ కొందరు అంటున్నారు. దాంతో జైసింహా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో విడుదల అవ్వడం లేదని, సక్సెస్ టాక్ తెచ్చుకుంటే వారం రోజుల తర్వాత ఓవర్సీస్‌లో విడుదల అయ్యే అవకాశాలున్నాయని కొందరు అంటున్నారు. కాని ఆ వార్తల్లో నిజం లేదని ఓవర్సీస్‌లో 100కు పైగా స్క్రీన్‌లలో బాలయ్య సినిమాను వేయబోతున్నట్లుగా నందమూరి అభిమానులు చెబుతున్నారు. చిత్ర యూనిట్ సభ్యుల నుండి మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.