ప‌డి ప‌డి లేచే మ‌న‌సు ఫ‌స్ట్ లుక్

Padi Padi Leche Manasu First Look Poster

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

శ‌ర్వానంద్ కొత్త‌మూవీ టైటిల్ అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతున్న చిత్రానికి ప‌డి ప‌డి లేచే మ‌న‌సు అనే టైటిల్ ఖ‌రారుచేశారు. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో శ‌ర్వానంద్ స‌ర‌స‌న సాయిప‌ల్ల‌వి హీరోయిన్ గా న‌టిస్తోంది. శ‌ర్వానంద్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. పోస్ట‌ర్ లో శ‌ర్వానంద్ డిఫ‌రెంట్ లుక్ తో క‌నిపిస్తున్నాడు. వేస‌విలో ఈ సినిమా రిలీజ్ చేయాల‌ని చిత్ర‌యూనిట్ భావిస్తోంది. విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ వ‌రుస విజ‌యాలు సాధిస్తున్నాడు శ‌ర్వానంద్. పెద్ద హీరోల‌తో పోటీప‌డి మ‌రీ ఆయ‌న సినిమాలు ఘ‌న‌విజ‌యం సొంతంచేసుకుంటున్నాయి. అదే స‌మ‌యంలో ఫ్యామిలీ హీరో అన్న గుర్తింపు కూడా సాధించాడు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో మినిమ‌మ్ గ్యారంటీ ఉన్న హీరోల్లో శ‌ర్వానంద్ మొద‌టి వ‌రుస‌లో ఉన్నాడు. ప‌డి ప‌డి లేచే మ‌న‌సు కూడా శ‌ర్వానంద్ కెరీర్ లో మంచి చిత్రంగా మిగిలిపోతుంద‌ని చిత్ర యూనిట్ నమ్మ‌కంతో ఉంది.