థియేటర్ల బంద్‌… విడుదల ఎలా?

Sai Pallavi Kanam Movie Affected By Cinema Theaters Bandh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మార్చి 2 నుండి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్‌ కొనసాగుతున్న విషయం తెల్సిందే. డిజిటల్‌ ప్రొవైడర్ల తీరుకు నిరసనగా నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదట ఈ బంద్‌ రెండు మూడు రోజులు ఉంటుందని అంతా భావించారు. కాని డిజిటల్‌ ప్రొవైడర్లు మాత్రం మొండి పట్టుదలతో రేట్లు తగ్గించేది లేదు అని తేల్చి చెప్పడంతో నాల్గవ రోజు బంద్‌ కొనసాగుతుంది. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పలు సినిమాలు నష్టపోతున్నాయి. గత వారం విడుదలైన సినిమాలు పెద్దగా కలెక్షన్స్‌ను వసూళ్లు చేయకుండానే బంద్‌ ప్రారంభం అయ్యింది. ఇక ఈ వారంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన ‘కణం’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది.

ఒక వైపు బంద్‌ కొనసాగుతున్నా కూడా మరో వైపు ‘కణం’ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ఈవారంలోనే సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. బంద్‌ కొనసాగితే సినిమాను వాయిదా వేయాల్సి వస్తుంది. మూడు నాలుగు వారాలుగా ఈ చిత్రం అదుగో ఇదుగో అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు. తాజాగా పెద్ద సినిమాలు లేని కారణంగా ‘కణం’ సినిమా ఈ వారం విడుదల అయ్యే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో బంద్‌ కొనసాగేలా ఉంది. దాంతో కణం మళ్లీ వాయిదా పడే అవకాశాలున్నాయని సినీ వర్గాల వారు అంటున్నారు. థియేటర్ల బంద్‌ కొనసాగుతున్న సమయంలో సినిమా విడుదల ఎలా పెట్టుకున్నారంటూ కణం చిత్ర నిర్మాతలను నిర్మాతల మండలి సభ్యులు ప్రశ్నిస్తున్నారు.