Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పూరీ జగన్నాథ్ సినిమా అంటే మాస్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ అని పేరుంది. అయితే సినిమా మాస్ ను ఆకర్షించేలా ఉన్నా…అందులోని పాటలు మాత్రం క్లాస్, మాస్ అందరినీ కట్టిపడేస్తాయి. పూరీ సినిమాల్లో సాంగ్స్ అంటే అభిమానుల్లో స్పెషల్ క్రేజ్ ఉంది. సినిమాలో తప్పనిసరిగా ఓ మెలోడీ సాంగ్ ను ఉంచటానికి ట్రై చేస్తారు పూరీ. తాజాగా బాలకృష్ణ తో చేస్తున్న పైసావసూల్ లోనూ మెలోడీ సాంగ్ ఒకటుంది. కన్ను కన్ను కలిశాయి…ఎన్నో ఎన్నో తెలిశాయి అనే పల్లవితో సాగే ఈ పాట టీజర్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. పైసా వసూల్ మాస్ సినిమా అని భావిస్తున్న వారి కోసం ఈ మెలోడీ సాంగ్ అని, యూత్ ఫుల్ బాలయ్య, బ్యూటిఫుల్ శ్రియ… అనూప్ రూబెన్స్ స్వరపర్చిన పాటలో సందడి చేశారని చిత్ర యూనిట్ తెలిపింది. అప్పుడే ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద బ్రహ్మ నిర్మిస్తున్న పైసా వసూల్ సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
శ్రీయ తో పాటు ముస్కాన్, సేథీ, కైరాదత్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అటు బాలకృష్ణను ఈ సినిమాలో పూరి ఎలా చూపించబోతున్నారో అని బాలయ్య అభిమానులతో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆసక్తిగా గమనిస్తోంది. మహేష్ బాబుతో పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ ను సృష్టించిన పూరీ బాలయ్యను కూడా అదే స్టయిల్ లో డైరెక్ట్ చేశారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. పైసా వసూల్ ట్రైలర్ చూస్తే ఇలానే అనిపిస్తోంది. తనకో కమీనా…ఖతర్నాక్ కావాలంటూ బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న డైలాగ్ అనంతరం బాలయ్య రియాక్షన్ చూస్తే… హీరో క్యారెక్టరైజేషన్ పోకిరిలానే కనిపిస్తోంది. ఈ ట్రైలర్ ఇప్పటికే యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ట్రైలర్ లానే పైసా వసూల్ కూడా పూరి మార్క్‌చిత్రంగా ఉంటుందా అన్నది తేలాలంటే సెప్టెంబరు 1 దాకా ఆగాల్సిందే.
మరిన్ని వార్తలు: