పందెంకోడి 2 రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్…!

pandemkodi 2 review

నటీనటులు :విశాల్‌, కీర్తి సురేష్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రాజ్‌కిరణ్‌ తదితరులు
సంగీతం : యువన్‌ శంకర్‌రాజా
నిర్మాణం : విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్, లైట్ హౌస్ మూవీ మేకర్స్
సినిమాటోగ్రఫీ : కె.ఎ.శక్తివేల్‌
నిర్మాత : విశాల్‌, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతిలాల్‌ గడా
రచన-దర్శకత్వం :ఎన్‌.లింగుస్వామి

pandham-kodi-vishal-movies

మాస్ హీరో విశాల్ కెరియర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది ‘పందెం కోడి’ సినిమా. 2005 సంవత్సరంలో విడుదలయిన ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి కొనసాగింపుగా 13 ఏళ్ల తరువాత తెరకెక్కిన ‘పందెం కోడి 2’ విజయదశమి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకువచ్చింది. విశాల్‌, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో విశాల్ ప్రేయసి అంటూ తమిళ మీడియా హడావిడి చేసే వరలక్ష్మి శరత్ కుమార్ ప్రతినాయిక పాత్రలో కనిపించనుండడంతో అంచనాలు పెరిగిపోయాయి. గతంలో విశాల్‌, ఎన్‌.లింగు స్వామి కాంబినేషన్‌లో వచ్చిన ‘పందెంకోడి’ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయి విశాల్‌ కెరీర్‌కి టర్నింగ్‌ పాయింట్‌ అయింది. దీంతో డిటెక్టివ్, అభిమన్యుడు లాంటి వరస హిట్‌లతో ఊపుమీద ఉన్న విశాల్ ఈ సినిమాతో మరో హిట్ కొట్టాడా లేదా అనేది సమీక్ష లోకి వెళ్లి చూడాల్సిందే.

కధ :

pandhamkodi2-vishal

పందెం కోడిలో చూపినట్టుగానే విశాల్ తండ్రి చుట్టుపక్కల అన్ని ఊళ్లకీ పెద్ద, అయితే ఆ ఊళ్లన్నీ కలిసి చేసుకునే వీరభద్ర స్వామి జాతరలో చోటు చేసుకున్న చిన్న వివాదం చిలికి చిలికి రెండు కుటుంబాల మధ్య పగగా మారుతుంది. ఒక కుటుంబంలో అసలు వారసుడే లేకుండా చేయాలని మరో కుటుంబం ప్రయత్నిస్తుంది.భర్తను పోగోట్టుకున్న భవానీ(వరలక్ష్మి) ఆ పగే పరమావధిగా బతుకుతూ మళ్ళీ ఎప్పుడు జాతర జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఊర్లో జరిగే గొడవల వలన ఎక్కడో దూరంగా విదేశాల్లో ఉంటున్న విశాల్ తన సొంత ఊరికి వస్తాడు. ఈ సమయంలో జాతర జరుగుతున్నప్పుడు అసలు రక్తపాతం జరగకుండా చూసుకుంటానని విశాల్ తండ్రి మాట ఇస్తాడు. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం తండ్రీ కొడుకులు ఎంత కష్ట పడ్డారు అనేదే కధ.

విశ్లేషణ :

pandham-kodi2

సినిమా మొత్తం సీమ బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేసాడు దర్శకుడు లింగుస్వామి. ఎక్కడా పాత వాసన పోకుండా అలా అని అది ఎక్కువ అవకుండా జాగ్రత్తపడ్డారు ఆయన. విశాల్ ఎప్పటిలానే యాక్షన్ సన్నివేశాలలో తన ప్రతాపం చూపాడు, నటన కూడా చాలా మెరుగయ్యింది. ఇక కీర్తి సురేష్ విషయానికి వస్తే ఉన్నంతలో ఆమె బాగా నటించింది. ఏదో హీరోయిన్ ఉండాలి కాబట్టి అన్నట్టు ఆమె పాత్ర చిన్నగా ఉంది. ఇక చెప్పుకోవాల్సింది వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి ఆమె నటన మాత్రం సినిమాకే హైలైట్ అనడంలో సందేహం లేదు.

vishal-pamdham-kodie-movies

ఎందుకంటే అంతలా ఆమె విజ్రుంభించి నటిచింది. సినిమా మొత్తం జాతర నేపధ్యంలోనే ఉండడంతో సినిమాటోగ్రఫీదే పెద్ద పని అది కూడా సవ్యంగా అయ్యేలా చూశారు కె. ఎ. శక్తివేల్. అయితే దాదాపు అన్ని చోట్లా తమిళ సినిమా చాయలు కనిపించాయి. ఇక మిగిలిన నటీనటులు తెలుగులో పెద్దగా పరిచయంలేని వారు అయినా ఎవరికీ వారు తమ తమ పరిధి మేర నటించారు. సినిమా మొత్తానికి క్లైమాక్స్ హైయిట్ అని చెప్పవచ్చు.

తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ : ఈ దసరా పందెం కోడి మంచి పోటీ ఇచ్చేలా ఉంది.
తెలుగు బులెట్ రేటింగ్ : 2.5 / 5