ఎమ్మెల్యేగా పోటీకి సిద్దమన్న ఎంపీ !

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమంటు కీలక వ్యాఖ్యలు చేశారు హిందూపురం టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే అసెంబ్లీ బరిలో దిగుతానంని అనంతపురం జిల్లా పుట్టపర్తి లేదా పెనుకొండ స్థానాల నుంచి పోటీకి సిద్దమని అంటున్నారు. అంతేకాదు తన కుమారుడు శిరీష్ కూడా ఎన్నిక బరిలోకి దిగేందుకు సిద్ధమని ఆయన అంటున్నారు. సోమవారం హిందూపురంలో మాట్లాడిన కిష్టప్ప ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడి నంచి పోటీ చేయాలన్నది అధినేత చంద్రబాబు స్పష్టత ఇస్తారని అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశానని ఎంపీ, ఎమ్మెల్యేగా తనకు అనుభవం ఉందని ఆయన చెబుతున్నారు. అయితే ఎమొఏ కిష్టప్ప ఎమ్మెల్యేగా పోటీ చేస్తానడం.. పుట్టపుర్తి, పెనుకొండను ఆప్షన్స్‌గా చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యత సంచతిరించుకుంది.ఈ రెండు స్థానాల్లో టీడీపీలో కీలకంగా ఉన్న నేతలు ఉన్నారు.

ఎమ్మెల్యేగా పోటీకి సిద్దమన్న ఎంపీ ! - Telugu Bullet

పుట్టపర్తి నుంచి మాజీ మంత్రి, ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి పెనుకొండ నుంచి అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్ధసారథిలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. మరి వారికి కాదని ఈయనకు చంద్రబాబు ఎలా సీటు ఇస్తారని అనుకున్నారో ? ఏమో కానీ ఆయన వ్యాఖ్యలు కలకలన్నే రేపుతున్నాయి. వాస్తవానికి మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారట. ఈ మధ్యే సునీత కూడా తన కుమారుడి రాజకీయ భవిష్యత్ చంద్రబాబు చేతిలో ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ఆనాటి నుండి శ్రీరామ్ హిందూపురం ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. నిమ్మల కిష్టప్ప సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఒకవేళ శ్రీరామ్ పోటీ చేస్తే తాను ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలనే తన మనసులో కోరికను నిమ్మల ఇలా బయటపెట్టారా అని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చంద్రబాబు ఏమి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల మరి.