పార్ల‌మెంట‌రీ ప్యానెల్ ముందుకు ప‌ద్మావ‌తి వివాదం…

Parliamentary panel calls Sanjay Leela Bhansali over Padmavati controversy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప‌ద్మావ‌తి చిత్ర వివాదం పార్ల‌మెంట‌రీ ప్యానెల్ కు చేరింది. ఈ వివాదంపై చ‌ర్చించేందుకు ప‌ద్మావ‌తి ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ‌శాఖ, సెన్సార్ బోర్డు అధికారులు ప్యానెల్ ఎదుట హాజ‌రు కానున్నారు. పార్ల‌మెంట‌రీ ప్యాన‌ల్ అధ్య‌క్షుడు అనురాగ్ ఠాకూర్ ఈ మేర‌కు ప్ర‌క‌టించారు. చిత్ర వివాదంపై భ‌న్సాలీ ప్యానెల్ ఎదుట వాద‌న‌లు వినిపించ‌నున్నారు.

Karnisena-wants-to-do-Ban-P

చిత్తోర్ రాణి ప‌ద్మిణి జీవిత‌కథ ఆధారంగా తెర‌కెక్కించిన ప‌ద్మావ‌తిపై రాజ్ పుత్ క‌ర్ణిసేన తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తంచేస్తోంది. ఈ సినిమాలో ప‌ద్మిణిని త‌ప్పుగా చూపించార‌ని క‌ర్ణిసేన అభ్యంత‌రాలు వ్య‌క్తంచేస్తోంది. బీజేపీ అధికారంలో ఉన్న ప‌లు రాష్ట్రాలు సినిమాపై నిషేధం విధించాయి. అయితే ఈ వివాదంపై భ‌న్సాలీ ప‌లుమార్లు వివ‌ర‌ణ ఇచ్చారు. రాణి ప‌ద్మావ‌తి, అల్లావుద్దీన్ ఖిల్జీ మ‌ధ్య అస‌భ్య‌క‌ర స‌న్నివేశాలు ఏమీ లేవ‌ని ఆయ‌న ప‌దే ప‌దే చెబుతున్న‌ప్ప‌టికీ ఆందోళ‌న‌లు చ‌ల్లార‌లేదు. గురువారం పార్ల‌మెంట‌రీ ప్యాన‌ల్ చ‌ర్చ త‌ర్వాత ప‌ద్మావ‌తి విడుద‌ల‌పై క్లారిటీ రానుంది.