మాటల రచయత, కథ రచయత పరుచూరి గోపాలకృష్ణ ఈ మద్య పరుచూరి పలుకులు అనే కార్యక్రమంతో ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను చేదు జ్ఞాపకాలను సినిమా రంగ విశేషాలను. సిని పరిశ్రమకు చెందినా పెద్ద వారితో సావాసం, ఈలాంటి విషయాలను పరుచూరి పలుకులు ప్రోగ్రాంతో మనముందుకు వస్తుంటాడు. పరుచూరి గోపాలకృష్ణ కు ఎన్టీఆర్ తో 14ఏండ్ల అనుభందం ఉన్నది. ఎన్టీఆర్ ను చాలా దగ్గరగా గమనించిన వ్యక్తీ పరుచూరి గోపాలకృష్ణ. ఎన్టీఆర్ చివరి సినిమా మేజర్ చంద్రకాంత్ సినిమాకు పనిచేశాడు. ఆ టైములో అన్నగారితో మంచి అనుభందం ఏర్పడింది.
తాజాగా అయన క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాని చూశాడు. అందులో ఎన్టీఆర్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను చూపించలేదు ఎందుకని దర్శకుడు క్రిష్ కి ఫోన్ చేసి అడిగాను. అప్పుడు క్రిష్ ఓ విషయం చెప్పారు. బాలకృష్ణ గారు నాతో చెప్పారు…. నాన్న గారి జీవితాని తెర రూపంలో చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు కూడా పాజిటివ్ థింక్ తో బయటకు రావాలి తప్ప నెగటివ్ థింక్ ఉండకుడదని చెప్పారు. అందువలన మేము అయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మేము చూపించలేదు. ఎన్టీఆర్ పైన ఎవరెవ్వరు మోసం చేశారు. ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనేది మేము చుపించాదలచలేదు. అయన సినిమాలోకి ఎలా వచ్చారు. ఎన్నెన్ని గొప్ప గొప్ప సినిమాలు తీశారు వాటి తాలుకు మాత్రమే మేము చూపించాం అన్నారు. ఈ విషయాన్ని పరుచూరి పలుకులు అనే ప్రోగ్రాంలో పరుచూరి గోపాలకృష్ణ గుర్తుకు చేశాడు. అంతటి