అప్పట్లో సినిమాకు సంభాషణలు రాయాలంటే ముఖ్యంగా వినబడే పేరు పరుచూరి బ్రదర్స్. తెలుగులో ఎన్నో సినిమాలకు కథలు, డైలాగ్ లు అందించారు. పరుచు గోపాలకృష్ణ పరుచూరి పలుకులు అనే పేరుతో ఈ మద్య ఓ కార్యక్రమాని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో సూపర్ స్టార్ రజినీకాంత్ గురుంచి కొన్ని ఆసక్తికర వ్యాక్యాలు చేశాడు. అవి ఏమిటి అంటే సూపర్ స్టార్ రజినీకాంత్ దగ్గర ఓ కథ ఉన్నది అది మమ్ములను వినమని చెప్పాడు. మోహన్ బాబు కు, రజినీకాంత్ మంచి స్నేహితుడు. ఆ సమయంలోనే రజినీకాంత్ రాసిన కథను మాకు వినిపించాడు.
ఒక్క సూపర్ స్టార్ కథ రాయడం చూసి మేము ఆశ్చరయపోయం. అదే కథకు నేను డైలాగ్ రాశాను. ఆ చిత్రం ఏదో కాదు మోహన్ బాబు నటించిన రాయలసీమ రామన్న చౌదరి. అందులో నేను రాసిన పంచ్ డైలాగ్ మల్లీ వెంట్రుకలు వస్తాయనే గుండు కొట్టించుకుంటున్నారు. అదే మల్లీ వెంట్రుకలు రావని తెలిస్తే మాత్రం ఎవ్వరు గుండు కూడా కోటించుకోరు అన్న డైలాగ్ రజినీకాంత్ కు బాగా నచ్చి ఆ టైములో రజినీకాంత్ నటిస్తున్నా బాబా సినిమాకు డైలాగ్ రాయమన్నాడు. అందుకు నేను ఇంతవరకు లిప్పు కు డైలాగ్ రాయడం మాకు తెలవదు సర్ మమ్ములను క్షమించండి అన్నాను. ఆ టైములో రజినీకాంత్ ఇచ్చినా ఆఫర్ నేను వదిలేసుకున్నాను అన్నారు.